Chat GPT: చాట్ జీపీటీపై ఆ దేశంలో నిషేధం విధించారు. ఎందుకంటే
ప్రపంచవ్యాప్తంగా చాట్ జీపీడీ మంచి ఆదరణ సంపాదించుకుంది. నేడు అనేక మంది ఈ చాట్ జీపీటీని వినియోగిస్తున్నారు. ఇది కృత్రిమమేధతో కూడిన కంప్యూటర్ అప్లికేషన్.
ప్రపంచవ్యాప్తంగా చాట్ జీపీడీ మంచి ఆదరణ సంపాదించుకుంది. నేడు అనేక మంది ఈ చాట్ జీపీటీని వినియోగిస్తున్నారు. ఇది కృత్రిమమేధతో కూడిన కంప్యూటర్ అప్లికేషన్. టెక్ రంగంలోకి ఇది రావడంపై నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటలీ ఈ చాట్ జీపీటీపై నిషేధం విధించింది. అది తక్షణమే అమల్లోకి వచ్చేలా ఇటలీ అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో చాట్ జీపీటీని బ్లాక్ చేసేశారు. దీన్ని బ్లాక్ చేసిన మొదటి ఐరోపా దేశంగా ఇటలీనే కావడం గమనార్హం.
చాట్ జీపీటీ అనేది తమ దేశ సమాచార భద్రతా నియంత్రణలకు లోబడి ఉందా లేదా అనేదానిపై విచారణ జరుపుతామని తెలిపింది. డేటా ఉల్లంఘనకు సంబంధించిన కేసు తమ దగ్గరికి రావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇటలీ ప్రకటించింది. ఇప్పటికే దీనిపై చైనా, రష్యా, ఇరాన్, ఉత్తర కొరియాలు కూడా నిషేధం విధించాయి. గతేడాది చివరలో చాట్‌జీపీటీ ప్రపంచానికి అందుబాటులోకి వచ్చింది. అలాగే ఇందులో మైక్రోసాఫ్ట్ కూడా పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేసింది.