అమెరికా వీసా అప్లై చేసే భారతీయులకు ఝలక్.. అమెరికా ఎంబసీ కొత్త రూల్..!

అమెరికా వెళ్లాలంటే.. అక్కడికి ఎందుకెళ్తున్నారో చెప్పాలి. ఎన్నిరోజులు ఉంటారో చెప్పాలి. అవసరం అయితే బ్యాంక్ అకౌంట్లు, బ్యాక్‌గ్రౌండ్‌ వెరిఫికేషన్ డీటేల్స్ సమర్పించాలి. తాజాగా కొత్త రూల్ కూడా తీసుకొచ్చింది అమెరికా. ఆ దేశం వచ్చే వ్యక్తులు సోషల్ మీడియా అకౌంట్ల డీటేల్స్ కూడా ఇవ్వాలని చెప్పింది. ట్రంప్ రెండోసారి పవర్‌లోకి వచ్చాక.. సోషల్‌ మీడియా వెట్టింగ్ అనే కొత్త ప్రాసెస్‌ని కూడా షురూ చేశారు.

అమెరికా వీసా అప్లై చేసే భారతీయులకు ఝలక్.. అమెరికా ఎంబసీ కొత్త రూల్..!

Updated on: Jun 24, 2025 | 5:52 PM

అమెరికా వెళ్లాలంటే.. అక్కడికి ఎందుకెళ్తున్నారో చెప్పాలి. ఎన్నిరోజులు ఉంటారో చెప్పాలి. అవసరం అయితే బ్యాంక్ అకౌంట్లు, బ్యాక్‌గ్రౌండ్‌ వెరిఫికేషన్ డీటేల్స్ సమర్పించాలి. తాజాగా కొత్త రూల్ కూడా తీసుకొచ్చింది అమెరికా. ఆ దేశం వచ్చే వ్యక్తులు సోషల్ మీడియా అకౌంట్ల డీటేల్స్ కూడా ఇవ్వాలని చెప్పింది. ట్రంప్ రెండోసారి పవర్‌లోకి వచ్చాక.. సోషల్‌ మీడియా వెట్టింగ్ అనే కొత్త ప్రాసెస్‌ని కూడా షురూ చేశారు. అంటే.. మీ ఇతర డాక్యుమెంట్స్‌తో పాటు ఫేస్‌బుక్‌, X, ఇన్‌స్టా లాంటి మీ సోషల్ మీడియా అకౌంట్స్‌ను కూడా తూర్పారబడతారన్నమాట..!

తాజాగా US ఎంబసీ-ఇండియా ఇచ్చిన ఆర్డర్స్‌ ప్రకారం ఎవరైతే F, M, J నాన్‌-ఇమ్మిగ్రెంట్ వీసాలు అప్లై చేస్తారో వాళ్లంతా కూడా సోషల్ మీడియా వెట్టింగ్‌ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాళ్ల సోషల్ మీడియా అకౌంట్లలో ఉన్న ప్రైవసీ ఆప్షన్‌ని డిసేబుల్ చేసి, అంతా పబ్లిక్ చేసేయాలి. ఏ మాత్రం దాపరికం ఉండకూడదు. ముందుగా.. అసలు ఈ వీసాలకి ఎవరి అప్లై చేస్తారో చూద్దాం

F – చదువుకోడానికి వెళ్లే విద్యార్థులు అప్లై చేసే వీసా.

M – ఒకేషనల్ కోర్సులు చేసుకునేందుకు అప్లై చేసుకునే వీసా.

J – ఎక్సేంజ్‌ విజిటర్ వీసా అంటారు. అంటే రీసెర్చర్స్‌, స్కాలర్స్‌, ఇంటర్న్‌షిప్‌కి వెళ్లేవాళ్లకు ఇచ్చే వీసా.

ఇప్పటికే H1Bతోపాటు డిఫెండెంట్ వీసాలకు ఆల్రడీ కావల్సినన్ని రూల్స్ ఉన్నాయి. ఇప్పుడు మిగిలిన ఈ మూడు నాలుగు ఫార్మాట్లకు కూడా సోషల్ మీడియా వెట్టింగ్‌ని అప్లై చేస్తోంది అమెరికా. తాజాగా US ఎంబసీ ఆదేశించిన నో ప్రైవసీ రూల్ ఏంటో చూద్దాం

సహజంగా సోషల్ మీడియాలో పేరు మీదే ఉన్నా ఫోటో మీకిష్టమైన ఏదో ఉంటుంది. కానీ US వెళ్లాలనుకుంటే అది కుదరదు, మీ ఫోటోనే ఉండాలి. ఫోన్‌ నెంబర్లు, మెయిల్ ఐడీలు, బర్త్‌ డేట్‌, వయసు, కుటుంబ వివరాలు, ఇతర పర్సనల్‌ డీటేల్స్ చాలామంది ఎంటర్ చేస్తారు. కానీ అవన్నీ ప్రైవైసీతో తొక్కిపట్టేస్తారు. వాళ్ల అనుమతి ఇస్తే గానీ మరొకరు వాటిని చూడలేదు. కానీ ఇకపై అలా కుదరదు. మీరు పొందుపరిచిన వ్యక్తిగత వివరాలన్నీ పబ్లిక్ అందరికీ తెలిసేలా ఆప్షన్‌ని అడ్జస్ట్ చెయ్యాలి.

ఇదంతా ఎందుకంటే US వీసా అప్లై చేసినప్పుడు మీ సంబంధిత అకౌంట్లలోకి వెళ్లి మీ పూర్తి సమాచారాన్ని అక్కడ కూడా US ఎంబసీ అధికారులు చెక్ చేస్తారు. ఏ మాత్రం తేడా క్యాండిడేట్ అనిపించినా.. రిజెక్టెడ్ అని చెప్పడానికి ఇదో వెసులుబాటు అన్నమాట. ఇంతకీ సోషల్ మీడియాను US ఎందుకు ఇంతగా వెట్టింగ్ పేరుతో నడిపిస్తోందో తెలుసా?
ఇంటర్వ్యూలో గట్టెక్కేలా సబ్జెక్ట్‌ బట్టిపట్టొచ్చు. ఇతర డాక్యుమెంట్లు సృష్టించొచ్చు. ఇతర ఏదేనా మేనేజ్ చెయ్యొచ్చు. కానీ మన సైకాలజీని ప్రతిబింబించేది మాత్రం మన సోషల్ మీడియా అకౌంట్లే. అందులో మనం ఏంటో నిజం ఉంటుంది. ఏ క్షణానికి ఉన్న ఆలోచనలను, అక్షరాలుగానో, పోస్టులుగానో మార్చి ఆ క్షణాన్నే షేర్ కొట్టేస్తాం. ఆ ఆలోచనలు అమెరికాకు వ్యతిరేకం అని తేలితే.. బస్‌.. వీసా ఖల్లాస్‌..! సో బీకేర్ ఫుల్..!!

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..