Strong earthquake : ఫిలిప్పైన్స్‌లో భారీ భూ ప్రకంపనలు.. రిక్టర్ స్కేల్‌పై 7.0గా నమోదు..

|

Jan 22, 2021 | 12:47 AM

ఫిలిప్పైన్స్ వణికిపోయింది. అంతా పనులు ముగించుకుని ఇంటి చేరుకున్న సమయంలో ఒక్కసారిగి కలకలం రేగింది. పెద్ద ఎత్తున భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి...

Strong earthquake : ఫిలిప్పైన్స్‌లో భారీ భూ ప్రకంపనలు.. రిక్టర్ స్కేల్‌పై 7.0గా నమోదు..
Follow us on

Strong Earthquake : ఫిలిప్పైన్స్ వణికిపోయింది. అంతా పనులు ముగించుకుని ఇంటి చేరుకున్న సమయంలో ఒక్కసారిగి కలకలం రేగింది. పెద్ద ఎత్తున భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. భారీ శబ్ధం రావడంతో జనం ఇళ్ల నుంచి పరుగులు పెట్టారు. ఏం జరుగుతుందో తెలిసేలోగా నేల కుంగిపోయింది.

ఫిలిప్పైన్స్‌లోని దక్షిణ ప్రాంతంలో గురువారం రాత్రి భూమి కంపించింది. దాని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.0గా రికార్డయింది.  ఎటువంటి ఆస్తినష్టం జరుగలేదని అధికార వర్గాలు తెలిపాయి. అమెరికా జియలాజికల్ సర్వే కథనం ప్రకారం మిండానావో దీవిలోని ఆగ్నేయ నగరం దవావో సిటీకి 310 కిలోమిటర్ల దూరంలో 95 కి.మీ లోతున భూకంప కేంద్రంను అధికారులు గుర్తించారు.

స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8.23 గంటలకు భూప్రకంపనలు సంభవించాయి. దీని ప్రభావంతో జోస్ అబాద్ శాంతోస్ సిటీలో 15 నిమిషాల సేపు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. స్థానికులు భయంతో ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారని స్థానిక పోలీస్ చీఫ్ కెప్టెన్ గ్లాబ్య్నారీ మురిల్లో చెప్పారు.