ఇండోనేషియాలో భూకంపం

ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై దీని తీవ్రత 6.1గా నమోదైంది. ఇప్పటి వరకూ ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. అతి తక్కువ సమయం మాత్రమే భూప్రకంపనలు రావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణనష్టం వాటిల్లినట్లు సమాచారం లేదు. ఇండోనేషియాలో తరచూ భూకంపాలు రావడం, అగ్నిపర్వతాలు బద్దలవడం జరుగుతుంది. అత్యంత ప్రమాదకరమైన రింగ్‌ఆఫ్‌ ఫైర్‌ జోన్‌లో ఇది ఉంది. గత సెప్టెంబర్‌లో 7.5 తీవ్రతతో భూకంపం సంభవించి దాదాపు 2,200 మంది […]

ఇండోనేషియాలో భూకంపం

Edited By:

Updated on: Jun 03, 2019 | 4:01 PM

ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై దీని తీవ్రత 6.1గా నమోదైంది. ఇప్పటి వరకూ ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. అతి తక్కువ సమయం మాత్రమే భూప్రకంపనలు రావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణనష్టం వాటిల్లినట్లు సమాచారం లేదు. ఇండోనేషియాలో తరచూ భూకంపాలు రావడం, అగ్నిపర్వతాలు బద్దలవడం జరుగుతుంది. అత్యంత ప్రమాదకరమైన రింగ్‌ఆఫ్‌ ఫైర్‌ జోన్‌లో ఇది ఉంది. గత సెప్టెంబర్‌లో 7.5 తీవ్రతతో భూకంపం సంభవించి దాదాపు 2,200 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.