Wooden City: మొత్తం చెక్కతోనే నిర్మిస్తున్న నగరం.. ప్రపంచంలోనే ఇది వెరీ స్పెషల్.. ఎప్పుడు ప్రారంభం అంటే..

|

Nov 25, 2023 | 11:21 AM

ఇప్పటి వరకు చెక్కతో చేసిన ఎన్నో వస్తువులను చూసి ఉంటారు. అయితే స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్‌లో ప్రపంచంలోనే తొలి చెక్క నగరాన్ని నిర్మిస్తోంది. డానిష్ స్టూడియో అధినేత హెన్నింగ్ లార్సెన్ ,  స్వీడిష్ సంస్థ వైట్ ఆర్కిటెక్టర్ ఈ నిర్మాణం వెనుక ఉన్నట్టు చెబుతున్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద చెక్క నగరం అవుతుందని హెన్నింగ్ లార్సెన్ పేర్కొన్నారు.

Wooden City: మొత్తం చెక్కతోనే నిర్మిస్తున్న నగరం.. ప్రపంచంలోనే ఇది వెరీ స్పెషల్.. ఎప్పుడు ప్రారంభం అంటే..
Stockholm Wood City
Follow us on

మనిషి తన అవసరాలకు అనుగుణంగా భూమిపై ఎన్నో అందమైన నగరాలను, భవనాలను నిర్మించుకున్నాడు. ప్రపంచంలో అనేక ఆకాశహర్మ్యాలు, సౌకర్యాలతో కూడిన ఇళ్లు, ఆధునిక సౌకర్యాలతో  మెరిసే నగరాలు ఉన్నాయి. వీటిని చూసిన తర్వాత ఎవరైనా ఇంప్రెస్ అవుతారు. వీటన్నింటిని పరిశీలిస్తే  భవనాలన్నీ కాంక్రీటుతో నిర్మించబడ్డాయి. అయితే కొన్నిసార్లు ప్రజలు ఏదైనా భిన్నంగా చేయాలని భావిస్తారు. ఏదో ఒక విభిన్నమైన పనిని చేసి అద్భుతాలను సృష్టిస్తారు. ఈరోజు స్వీడన్ నుంచి అలాంటి కథ ఒకటి వెలుగులోకి వచ్చింది. దీని గురించి తెలిస్తే ఎవరైనా షాక్ తింటారు.

ఇప్పటి వరకు చెక్కతో చేసిన ఎన్నో వస్తువులను చూసి ఉంటారు. అయితే స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్‌లో ప్రపంచంలోనే తొలి చెక్క నగరాన్ని నిర్మిస్తోంది. డానిష్ స్టూడియో అధినేత హెన్నింగ్ లార్సెన్ ,  స్వీడిష్ సంస్థ వైట్ ఆర్కిటెక్టర్ ఈ నిర్మాణం వెనుక ఉన్నట్టు చెబుతున్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద చెక్క నగరం అవుతుందని హెన్నింగ్ లార్సెన్ పేర్కొన్నారు.

ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే

ఓ కాలేజీని చూసిన తర్వాత ఆర్కిటెక్ట్‌కి ఒక ఆలోచన వచ్చింది. ఈ పద్ధతిలో కాలేజీని నిర్మించగలిగారు.. మొత్తం నగరాన్ని ఎందుకు నిర్మించకూడదని భావించారు. దీని తరువాత వాస్తుశిల్పి ఈ చెక్క నగరాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. స్టాక్‌హోమ్‌కు ఆగ్నేయంలో నిర్మించబోతున్న ఈ నగరం 250,000 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంటుందని డెవలపర్ అట్రియం లుంగ్‌బర్గ్ తెలిపారు. ఇందులో 7,000 కార్యాలయాలు ఉంటాయి. ప్రజలు నివసించేందుకు వీలుగా 2000 ఇళ్లు నిర్మిస్తామన్నారు.

ఇవి కూడా చదవండి

బిల్డర్ ప్రకారం ఈ స్థలంలో నిర్మాణాలకు ఇప్పటికే 400 కంటే ఎక్కువ కంపెనీలు పనిచేస్తున్నాయి. మీరు ఇక్కడ నివసించాలని ఆలోచిస్తున్నట్లయితే .. ఈ ప్రదేశానికి ఐదు నిమిషాల్లో సులభంగా చేరుకోవచ్చు. ఇప్పటికే ఎన్నో రకాల వస్తువులు ఉన్నాయి.. చెక్కతో నగరాన్ని ఎందుకు నిర్మించాలనే ప్రశ్న ఇప్పుడు అందరి మనస్సులో తలెత్తుతుంది. ఉక్కు కంటే కలప నెమ్మదిగా కాలిపోతుందని ఇంజనీర్లు చెపుతారు. ఇది ఆర్పడం సులభం. అందువల్ల ఇది మరింత సురక్షితం.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..