Greta Thunberg: ట్వీట్లపై ఢిల్లీ పోలీసుల నజర్.. స్వీడన్‌ యువ ఉద్యమకారిణి గ్రేటా థన్‌బర్గ్‌పై కేసు..!

|

Feb 04, 2021 | 5:49 PM

Delhi Police: స్వీడన్‌కు చెందిన సామాజిక యువ ఉద్యమకారిణి, పర్యావరణ కార్యకర్త గ్రేటా థన్‌బర్గ్‌పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీ..

Greta Thunberg: ట్వీట్లపై ఢిల్లీ పోలీసుల నజర్.. స్వీడన్‌ యువ ఉద్యమకారిణి గ్రేటా థన్‌బర్గ్‌పై కేసు..!
Follow us on

Delhi Police: స్వీడన్‌కు చెందిన సామాజిక యువ ఉద్యమకారిణి, పర్యావరణ కార్యకర్త గ్రేటా థన్‌బర్గ్‌పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో రెండు నెలలకుపైగా పోరాడుతున్న రైతులకు మద్దతుగా ఆమె వరుస ట్విట్స్ చేశారు. ఈ ట్విట్లను తీవ్రంగా పరిగణించిన ఢిల్లీ పోలీసులు గురువారం థన్‌బర్గ్‌పై కేసు నమోదు చేశారు. ఈ మేరకు నేరపూరిత కుట్రతోపాటు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసును నమోదు చేసినట్లు సమాచారం..

భారత రైతుల నిరసనకు మద్దతుగా గ్రేటా థన్‌బర్గ్‌ నిన్న పోస్ట్‌ చేసిన ట్వీట్లు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాయి. దీంతో పలువురు అంతర్జాతీయ ప్రముఖులు సైతం రైతుల ఆందోళనపై ట్విట్స్ చేశారు. భారత రైతుల నిరసనకు సంఘీభావం తెలుపుదాం అంటూ.. ఆమె రైతు ట్రాక్టర్‌ ర్యాలీ ఫొటోను ట్విట్ చేశారు. ఈ రోజు కూడా స్టాండ్‌విత్‌ఫార్మర్స్.. వారి శాంతియుత నిరసనకు మద్దతు తెలుపుతున్నాను.. ద్వేషం, బెదిరింపులు లేదా మానవ హక్కుల ఉల్లంఘనలు ఎప్పటికీ మారవు.. అంటూ ఆమె ట్విట్ చేశారు.

Also Read:

Farmers Protest: రోడ్లపై మేకులను తొలగించడం లేదు.. మరో చోటుకు మారుస్తున్నాం అంతే: ఢిల్లీ పోలీసులు

Farmers Protest: ఉద్యమం వెనుక రాజకీయాలు లేవు.. రైతు కుటుంబాన్ని పరామర్శించిన ప్రియాంక గాంధీ