Financial Crisis: ఆహార సంక్షోభంతో శ్రీలంక అతలాకుతలం అవుతోంది. ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పెట్రోలు కోసం వేర్వేరు క్యూలలో నిల్చున్న ఇద్దరు వ్యక్తులు కుప్పకూలి మరణించారు. దేశంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఈ ఘటనలు జరిగినట్టు పోలీసులు తెలిపారు. మృతి చెందిన వారిలో ఒకరి వయసు 70 కాగా, మరొకరి వయసు 72 ఏళ్లని కొలంబో (Colombo) పోలీసు ప్రతినిధి నళిన్ తల్దువా తెలిపారు. నాలుగు గంటలుగా వారు క్యూలో నిల్చోవడంతో స్పృహతప్పి పడిపోయి చనిపోయారని పేర్కొన్నారు.
అయితే గత కొన్ని రోజులుగా శ్రీలంక తీవ్రమైన ఆహార, ఆర్థిక సంక్షోభంతో అల్లాడిపోతోంది. నిత్యావసరాల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. దేశంలో ఇప్పుడు ఓ కోడిగుడ్డు ధర రూ.35 వరకు పలుకుతోంది. అంతేకాదు.. చికెన్ మాత్రం రికార్డు స్థాయిలో ధర ఉంది. ఇక్కడ కిలో చికెన్ ధర రూ.1000 వరకు పలుకుతోంది. ఇక పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. లీటర్ పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.283 ఉండగా, డీజిల్ ధర రూ.220 వద్ద కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే శ్రీలంక కరెన్సీ విలువ రూ.270కు పడిపోయింది. ఇక కరెంటు లేకుండా పోయింది. ఆర్థిక సంక్షోభం ముదరడంతో దేశంలోని 90 శాతం హోటళ్లు మూతపడ్డాయి. దేశంలో ధరల పెరుగుదల నేపథ్యంలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఇవి కూడా చదవండి: