Sril Lanka: చమురు కొనుగోలుచేయడానికి డబ్బులు లేవు.. భారత్ అప్పు ఇస్తే కొనుక్కుంటాం మంటున్న శ్రీలంక

|

Oct 17, 2021 | 9:47 PM

Sril Lanka: కరోనా మహమ్మారి దెబ్బకు గత ఏడాది కాలం నుంచి శ్రీలంక తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటుంది. ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. నిత్యావ‌స‌ర వస్తువుల..

Sril Lanka: చమురు కొనుగోలుచేయడానికి డబ్బులు లేవు.. భారత్ అప్పు ఇస్తే కొనుక్కుంటాం మంటున్న శ్రీలంక
Srilanka
Follow us on

Sril Lanka: కరోనా మహమ్మారి దెబ్బకు గత ఏడాది కాలం నుంచి శ్రీలంక తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటుంది. ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. నిత్యావ‌స‌ర వస్తువుల ధరలు కొండెక్కాయి. మరోవైపు విదేశీ మారకద్రవ్య నిల్వలు పూర్తిగా అడుగంటిపోయాయి. ఇప్పుడు ఈ దేశానికి ఇంధనం కొనుగోలు చేయడానికి కూడా నిధులు లేవు. దీంతో తమకు సాయం చేయమంటూ భారత్‌ని కోరుతుంది. చమురు కొనుగోళ్లకు చెల్లించేయడానికి కూడా నిధులు లేవు.. 50 కోట్ల డాల‌ర్లను అప్పుగా ఇవ్వమని అభ్యర్థిస్తోంది. ప్రస్తుతం తమ దేశంలో ఉన్న చ‌మురు నిల్వలు వ‌చ్చే జ‌న‌వ‌రి వ‌ర‌కు మాత్రమే స‌రిపోతుంద‌ని ఆ దేశ ఇంధ‌న శాఖ మంత్రి ఉద‌య గ‌మ్మన్‌పిలా హెచ్చరించిన కొన్ని రోజులకే శ్రీలంక నుంచి ఈ ప్రతిపాదన వచ్చింది.

శ్రీలంక ప్రభుత్వ రంగ సంస్థ సీలోన్ పెట్రోలియం కార్పొరేష‌న్.. ప్రధాన ప్రభుత్వ బ్యాంకులైన బ్యాంక్ ఆఫ్ సీలోన్‌, పీపుల్స్ బ్యాంక్‌ వంటి అనేక బ్యాంకులకు భారీగా బాకీ పడింది. ఈ బాంకులకు సీలోన్ పెట్రోలియం కార్పొరేష‌న్ సుమారు 330 కోట్ల డాల‌ర్లు చెల్లించాల్సి ఉంది. ఈ సంస్థ మిడిల్‌ఈస్ట్‌, సింగపూర్‌ నుంచి వివిధ రకాల పెట్రోలియం ఉత్పత్తులను దిగుమతి చేసుకొంటోంది. దీంతో ఆ అప్పులను తీర్చడానికి ‘భారత్‌’ సాయం అర్దిస్తుంది.

Also Read:  రేపు ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం.. బద్రీనాథ్ యాత్రకు బ్రేక్.. స్కూల్స్‌కు సెలవు..