Sri Lanka: శ్రీలంక నుంచి మాల్దీవులు.. అక్కడి నుంచి సింగపూర్ కు.. దేశాలు దాటుతున్న గొటబాయ

|

Jul 14, 2022 | 4:06 PM

ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంక(Sri Lanka) లో పరిస్థితులు రోజురోజుకు మారిపోతున్నాయి. రాజకీయ అనిశ్చితి కొనసాగుతుండగా రాజీనామా చేయకుండా దేశం దాటిన అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే నిన్న ఉదయం మాల్దీవులకు చేరుకున్నారు.....

Sri Lanka: శ్రీలంక నుంచి మాల్దీవులు.. అక్కడి నుంచి సింగపూర్ కు.. దేశాలు దాటుతున్న గొటబాయ
Mahinda Gotabaya Rajapaksa
Follow us on

ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంక(Sri Lanka) లో పరిస్థితులు రోజురోజుకు మారిపోతున్నాయి. రాజకీయ అనిశ్చితి కొనసాగుతుండగా రాజీనామా చేయకుండా దేశం దాటిన అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే నిన్న ఉదయం మాల్దీవులకు చేరుకున్నారు. అక్కడి నుంచి సౌదీ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో సింగపూర్‌కు (Singapore) బయల్దేరారని తెలుస్తోంది. ఫలితంగా శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే నియమితులయ్యారు. అయినప్పటికీ ఆందోళను ఆగకపోవడంతో రణిల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. తనను దేశం దాటనిస్తేనే రాజీనామా చేస్తానన్న గొటబాయ సురక్షితంగా గమ్యం చేరిన తర్వాతే పదవికి రాజీనామా చేయనున్నారు. కాగా.. ప్రధానిని గద్దె దింపాలంటూ ప్రారంభమైన నిరసనలతో అధికారిక నివాసాలను ఆక్రమించారు. ఏళ్ల చరిత్ర ఉన్న ఆ భవనాలు దేశ సంపద అని, వాటిని రక్షించాల్సిన అవసరం ఉందని పలువురు కోరుతున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు శ్రీలంక ప్రభుత్వం కొలంబోలో కర్ఫ్యూ విధించింది.

కాగా.. శ్రీలంకను అట్టుడుకుంచిన నిరసనలు ఇప్పుడు మాల్దీవులకు తాకాయి. మాల్దీవ్ ప్రెసిడెంట్ ఇబ్రహీం మహ్మద్ అధికారిక నివాసం ఎదుట శ్రీలంక వాసులు ఆందోళన చేపట్టారు. శ్రీలంక అధ్యక్షుడు గొటబయను వెంటనే వెనక్కి పంపాలని డిమాండ్ చేశారు. కాగా.. శ్రీలంక నుంచి మాల్దీవులకు (Maldives) చేరుకున్న గొటబాయ తాజా నిరసనలతో మాల్దీవుల నుంచి దుబాయ్ వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. శ్రీలంకలో ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. దీంతో మరోసారి ఎమర్జెన్సీ విధిస్తూ ప్రధానమంత్రి కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. గోటబయ వెళ్లిపోయిన తర్వాత తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రధాని రణిల్‌ విక్రమసింఘే బాధ్యతలు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి