Fuel Crisis: పెనం నుంచి పొయ్యిలోకి.. ఇకపై ఆ దేశంలో ప్రతిరోజు 10 గంటలు కరెంట్ కట్

|

Mar 30, 2022 | 6:30 PM

ఆర్థిక సంక్షోభంతో విలవిల్లాడుతున్న లంక ప్రభుత్వం(Sri Lanka).. తాజాగా మరో కఠిన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రోజులు 7 గంటలు కరెంట్ సరఫరా(Power Cut) నిలిపివేస్తుండగా ఇకపై ప్రతి రోజూ 10 గంటలు కోత విధించాలని నిర్ణయించింది. ఇంధనం...

Fuel Crisis: పెనం నుంచి పొయ్యిలోకి.. ఇకపై ఆ దేశంలో ప్రతిరోజు 10 గంటలు కరెంట్ కట్
Power
Follow us on

ఆర్థిక సంక్షోభంతో విలవిల్లాడుతున్న లంక ప్రభుత్వం(Sri Lanka).. తాజాగా మరో కఠిన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రోజులు 7 గంటలు కరెంట్ సరఫరా(Power Cut) నిలిపివేస్తుండగా ఇకపై ప్రతి రోజూ 10 గంటలు కోత విధించాలని నిర్ణయించింది. ఇంధనం కొరత కారణంగా ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని శ్రీలంక విద్యుత్‌ శాఖ మంత్రి వెల్లడించారు ఇప్పటికే పెట్రోల్‌ నుంచి కూరగాయల దాకా అన్నింటి ధరలు పెరిగి నరకం అనుభవిస్తున్న ప్రజలకు ఇది శరాఘాతంగా మారింది. ఆహార, ఆర్థిక సంక్షోభంతో (Financial Crisis) అల్లాడిపోతున్న ద్వీపదేశానికి విదేశీ మారక నిల్వలు గణనీయంగా పడిపోయాయి. ఫలితంగా కీలక దిగుమతులు నిలిచిపోయాయి. ఇంధనం సరిపడా లేక దేశంలో హైడ్రో ఎలక్ట్రిసిటీ కొరత ఏర్పడింది. భారత్‌ సహకారంతో డీజిల్‌ను దిగుమతి చేసుకుంటున్నప్పటికీ అది అత్యవసర సేవలు, పవర్‌ స్టేషన్లకే సరిపోతోంది. విద్యుత్‌ కోతల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళల్లో వీధి దీపాలు వెలగక అనేక నగరాలు చీకట్లో మగ్గుతున్నాయి. రెస్టారెంట్లు, వీధి వ్యాపారులు దీపాల వెలుగులో వ్యాపారాలు చేస్తున్నారు. సంక్షోభం కారణంగా ఆసుపత్రుల్లో మందులు లేక సాధారణ శస్త్రచికిత్సలను వాయిదా వేయాల్సిన పరిస్థితి నెలకొంది.

మరోవైపు ఇంధన కొరత కారణంగా రవాణా సదుపాయాలు నిలిచిపోయాయి. పేపర్‌ కొరతతో విద్యా సంస్థలు అన్ని రకాల పరీక్షలను వాయిదా వేశాయి. పెట్రోల్‌తో పాటు కూరగాయాల కోసం కూడా ప్రజలు బారులు తీరుతున్నారు. క్యూలైన్లలో నిలబడలేక ఇప్పటికే ముగ్గురు మరణించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ తీరుపై పౌరులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల ఆందోళనలూ చేపట్టారు. పర్యాటక దేశంగా పేరొందిన శ్రీలంకలో 2019లో ఈస్టర్‌ నాడు ఓ చర్చిలో ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటన ఆ దేశ పర్యాటక రంగాన్ని తీవ్రంగా దెబ్బకొట్టింది. దీంతో విదేశీ మారక నిల్వలు పడిపోయాయి. ఆ తర్వాత కరోనా మహమ్మారి ప్రభావంతో పాటు ప్రభుత్వం తీసుకున్న కొన్ని అనాలోచిత నిర్ణయాలు ఆ దేశాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేశాయి.

Also Read

viral Video: ఇంటి అద్దె కట్టలేక ఆఫీసులోనే మకాం పెట్టేసాడు.. తర్వాత ఏమైందంటే..?

Summer Temperature: చుక్కలు చూపిస్తున్న సూర్యుడు.. నిప్పుల కుంపటిలా తెలుగు రాష్ట్రాలు