Sri Lanka Economy Crisis: ఖజానా ఖాళీ అయ్యింది. విదేశీ అప్పులు చెల్లించలేని పరిస్థితి వచ్చిందని శ్రీలంక ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. మరోవైపు నిరసనలో కళాకారుడు సిరాజ్ గుండెపోటుతో చనిపోవడం తీవ్ర కలకలం రేపింది. ఈ నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశ ఖజానా దివాళా తీసినట్టు ప్రకటించింది. విదేశీ అప్పులను చెల్లించబోమని ప్రకటించింది. అంతర్జాతీయ దేశాలు తమకు సాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. ఐఎంఎఫ్ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించాలని కోరింది. 51 బిలియన్ డాలర్ల అప్పులను చెల్లించబోమని శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది.
శ్రీలంక ఆర్ధిక వ్యవస్థ విదేశీ అప్పుల కారణంగానే కుప్పకూలింది. చైనాతో పాటు జపాన్ కూడా భారీగా శ్రీలంకకు అప్పులు ఇచ్చింది. దివాలా తీసినట్టు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించడంతో ఇప్పుడు ఆ అప్పులు పరిస్థితి ఏంటో అర్ధం కావడం లేదు. రుణాల చెల్లింపులు సవాళ్లతో కూడుకున్నదే కాకుండా అసాధ్యం అనే స్థితికి చేరిపోయిందని శ్రీలంక సెంట్రల్‌బ్యాంక్ ప్రకటించింది. 2.2కోట్ల జనాభా కలిగిన శ్రీలంక గతంలో రుణ చెల్లింపులను ఎన్నడూ ఎగవేయలేదని శ్రీలంక సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ పీ నందాలాల్ వీరసింఘే పేర్కొన్నారు. చిత్తశుద్ధితోనే ఈ చర్యలు తీసుకున్నామన్న ఆయన తెలిపారు.
కొవిడ్ లాక్‌డౌన్’ కారణంగా విదేశీ మారక నిల్వలు మరింత క్షీణించాయని శ్రీలంక ప్రధానమంత్రి మహింద రాజపక్స అంతకుముందు పేర్కొన్నారు. దేశం ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఇప్పటికే దేశంలో జీవన వ్యయం విపరీతంగా పెరిగిపోతూ పరిస్థితులు దారుణంగా మారాయని.. రానున్న రోజుల్లో నిత్యవసర వస్తువులతోపాటు గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు విపరీతంగా పెరగడంతో పరిస్థితులు మరింత క్షీణించనున్నాయన్నారు. మరోవైపు శ్రీలంక నిరసన ప్రదర్శనలో విషాదం చోటు చేసుకుంది. కొలంబోలో శ్రీలంక హిప్/హాప్ రాప్ కళాకారుడు సిరాజ్ రుడెబ్వోయ్ గుండె పోటుతో చనిపోయాడు. ఆందోళనకారులను ఉత్సాహ పర్చేందుకు ర్యాప్ సాంగ్స్ పాడుతుండగా అక్కడే కుప్పకూలి చనిపోయాడు సిరాజ్ . ఓల్డ్ పార్లమెంట్ ఎదుట జరుగుతున నిరసనల్లో ఈ విషాదం చోటు చేసుకుంది.
Read Also… UP MLC Election Results: యూపీలో ఎన్నిక ఏదైనా బీజేపీదే హవా.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్