Sri Lanka: ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేనా..? కొలువుదీరిన శ్రీలంక కేబినెట్‌.. 17 మంది మంత్రులతో కొత్త మంత్రివర్గం

|

Apr 19, 2022 | 6:11 AM

Sri Lanka New Cabinet: తీవ్ర ఆర్థిక సంక్షోభంతో శ్రీలంక కొట్టుమిట్టాడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశాన్ని ఆర్థిక సంక్షోభం (Economic Crisis) నుంచి బయటపడేయటానికి

Sri Lanka: ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేనా..? కొలువుదీరిన శ్రీలంక కేబినెట్‌.. 17 మంది మంత్రులతో కొత్త మంత్రివర్గం
Sri Lanka Crisis
Follow us on

Sri Lanka New Cabinet: తీవ్ర ఆర్థిక సంక్షోభంతో శ్రీలంక కొట్టుమిట్టాడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశాన్ని ఆర్థిక సంక్షోభం (Economic Crisis) నుంచి బయటపడేయటానికి శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే కేబినెట్‌లోకి 17 మందిని తీసుకున్నారు. వీరంతా సోమ‌వారం రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణస్వీకారం చేశారు. రాజపక్సే ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేప‌ట్టిన త‌రువాత ఇది మూడో కేబినెట్ విస్తర‌ణ‌. కొత్త కేబినెట్‌లోఎనిమిది మంది మాజీ మంత్రులు ఉండగా, మిగిలిన వారంతా కొత్త వారు. శ్రీలంక చ‌రిత్రలో అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభం ఏర్పడ‌టంతో ఈనెల మూడో తేదీన ప్రధాన మంత్రి మహింద రాజపక్స మినహా 26 మంది మంత్రులతో కూడిన మొత్తం మంత్రివర్గం రాజీనామా చేసింది. దీంతో మరుసటి రోజు ప్రెసిడెంట్ రాజపక్సే పార్లమెంటు, ఇతర కార్యక్రమాల చట్టబద్ధత, స్థిరత్వాన్ని నిర్వహించడానికి నలుగురు మంత్రులను నియమించారు. అయితే ఇప్పుడు మొత్తం మంత్రుల సంఖ్య 17కు చేరింది.

శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆహారం, ఇంధన కొరత, పెరుగుతున్న ధరలు, విద్యుత్ కోతలు పెద్ద సంఖ్యలో ప్రజలను ప్రభావితం చేస్తున్నాయి, ఫలితంగా ప్రభుత్వంపై భారీ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. COVID-19 మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి కుదుపునకు గురైంది. విదేశీ మార‌క ద్రవ్యం కొర‌త ఏర్పడ‌టంతో ఆహారం, ఇంధనం, మెడిసిన్ దిగుమ‌తిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో అవ‌స‌ర‌మైన వ‌స్తువుల‌ కోసం మిత్ర దేశాల నుంచి సాయం కోరాల్సి వ‌స్తోంది.

ఆర్థిక పరిస్థితి కారణంగా ప్రధాని మహింద రాజపక్స, అధ్యక్షుడు గోటబయ రాజపక్స రాజీనామా చేయాలనే డిమాండ్లతో భారీ నిరసనలు వెల్లువెత్తాయి. అంతకు ముందు ప్రధాని మహీందా రాజపక్స జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజలు ఓపిక ప‌ట్టాల‌ని కోరారు. ఈ ప‌రిస్థితి నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్న ఆయన.. ప్రజ‌లు వీధుల్లోకి రావ‌డం మానేయాల‌ని అభ్యర్థించారు.

Also Read:

World Hottest City: ప్రపంచంలో వేసవిలో అత్యధికంగా వేడిగా ఉండే ప్రాంతం ఎక్కడుందో తెలుసా..?

Viral Video: లాక్డౌన్ తో చైనాలో దిగజారుతున్న పరిస్థితులు.. ఆకలితో చేపలు ఎలా పట్టారంటే..