Sri Lanka Crisis: అల్లర్లకు పాల్పడే వాళ్లు కన్పిస్తే కాల్చివేత.. శ్రీలంక సర్కార్ సంచలన నిర్ణయం!

|

May 10, 2022 | 9:12 PM

Shoot on Sight Orders: శ్రీలంకలో పరిస్థితి రోజు రోజుకీ దిగజారుతున్నట్లు కనిపిస్తోంది. ఉగ్ర నిరసనకారులను ఆపడానికి, హింసను అరికట్టడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Sri Lanka Crisis: అల్లర్లకు పాల్పడే వాళ్లు కన్పిస్తే కాల్చివేత.. శ్రీలంక సర్కార్ సంచలన నిర్ణయం!
Shoot On Sight Order
Follow us on

Sri Lanka Crisis: శ్రీలంకలో పరిస్థితి రోజు రోజుకీ దిగజారుతున్నట్లు కనిపిస్తోంది. ఉగ్ర నిరసనకారులను ఆపడానికి, హింసను అరికట్టడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అల్లర్లకు పాల్పడే వాళ్లు కన్పిస్తే కాల్చేయాలని సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. శ్రీలంక ప్రజలు సంయమనం పాటించాలని . శాంతిని కాపాడాలని దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స విజ్ఞప్తి చేశారు. దేశంలోని వివిధ నగరాల్లో రక్తసిక్తమైన ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.

మంత్రుల, ఎంపీల ఇళ్లే టార్గెట్‌గా ఆందోళనకారులు దాడులు చేయడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. శ్రీలంక హింసలో ఇప్పటి వరకు ఏడుగురు మరణించారు. ఈ దాడుల్లో దాదాపు మూడొందల మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులను కూడా ఆందోళనకారులు విడిచి పెట్టడం లేదు. ఆందోళనకారులు జరిపిన తాజా దాడుల్లో పశ్చిమ ప్రావిన్స్‌కు చెందిన సీనియర్‌ డీఐజీ దేశబంధు టెన్నాకూన్ గాయపడ్డారు. ఆయనను వెంటాడి చితకబాదారు. ఆయన వాహనాన్ని ఆందోళనకారులు ధ్వంసం చేశారు. దేశవ్యాప్తంగా కర్ఫ్యూ అమల్లో ఉన్నప్పటికీ దాన్ని ధిక్కరించి జనాలు నిరసనను కొనసాగిస్తున్నారు. ఈ కర్ఫ్యూ రేపు ఏడు గంటల వరకు అమల్లో ఉంటుందని అధికారులు ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

అటు ట్రింకోమలి నేవల్‌ బేస్‌ దగ్గర నిరసనలు హోరెత్తాయి. ఈ నేవల్‌ బేస్‌లోనే మాజీ ప్రధాని మహింద రాజపక్స కుటుంబ సభ్యులు తలదాచుకున్నారనే అనుమానాలు ఉన్నాయి. రాజపక్సను బయటకు పంపించాలని నిరసనకారులు డిమాండ్‌ చేశారు. మరో వైపు తెల్లవారుజామున మాజీ ప్రధాని మహింద రాజపక్స భారీ పోలీసు బందోబస్తు మధ్య తన నివాసం టెంపుల్‌ ట్రీస్‌ నుంచి బయటపడ్డారు. ఆయన ఇంట్లోకి దూసుకువచ్చేందుకు ప్రయత్నించిన నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు గాల్లో బాష్పవాయువు ప్రయోగించారు.