కరోనా: లక్ష మింక్‌లను చంపనున్న అధికారులు
కరోనా మనుషులనే కాదు మూగ జీవాలను హరిస్తోంది. పలు రకాల జంతువులు ఈ వ్యాధి బారిన పడుతున్నాయి. ముఖ్యంగా మింక్ జాతిలో కరోనా విస్తరిస్తోంది.

కరోనా మనుషులనే కాదు మూగ జీవాలను హరిస్తోంది. పలు రకాల జంతువులు ఈ వ్యాధి బారిన పడుతున్నాయి. ముఖ్యంగా మింక్ జాతిలో కరోనా విస్తరిస్తోంది. ఇక వాటి ద్వారా కరోనా మనుషులకు సోకే అవకాశం ఉండటంతో.. పలు దేశ ప్రభుత్వాలు మింక్‌లను చంపాలనుకుంటున్నాయి. ఈ క్రమంలో గత నెలలో నెదర్లాండ్స్ సర్కార్ ఆ దేశంలో దాదాపు 10వేల మింక్‌లను చంపేసింది. ఇక తాజాగా స్పెయిన్ కూడా ఈ జాతి జంతువులను చంపేందుకు సిద్ధమైంది.
దీనిపై అక్కడి స్థానిక మంత్రి జొయాక్విన్ ఓలోనా మాట్లాడుతూ.. ఓ ఫామ్‌లో 90% మింక్‌లకు కరోనా సోకిందని.. అందుకే అందులో ఉన్న దాదాపు లక్ష జంతువులను హతమార్చబోతున్నట్లు వివరించారు. ఇక ఓ వ్యక్తి ద్వారా మింక్‌లకు కరోనా సోకినట్లు అక్కడి అధికారులు భావిస్తున్నారు. అయితే మింక్‌ల నుంచి మళ్లీ మనుషులకు వైరస్ వ్యాప్తించే విషయంపై స్పష్టత లేదని ఓలోనా తెలిపారు. కాగా స్పెయిన్‌లో 305,935 కరోనా కేసులు నమోదు కాగా.. 28,416 మంది మరణించారు.