North Korea: అమెరికా రెచ్చగొడితే అణ్వాయుధాలు ప్రయోగిస్తాం.. మరోసారి రెచ్చిపోయిన నార్త్‌ కొరియా అధ్యక్షుడు.

|

Jul 29, 2022 | 7:15 AM

North Korea: నార్త్‌ కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మరోసారి రెచ్చిపోయారు. నిత్యం ఏదో ఒక వివాదాంశంతో వార్తల్లో నిలిచే కిమ్‌ తాజాగా మరోసారి అమెరికాను హెచ్చరించారు. అమెరికా, దక్షిణ కొరియా తమ దేశాన్ని రెచ్చగొడితే...

North Korea: అమెరికా రెచ్చగొడితే అణ్వాయుధాలు ప్రయోగిస్తాం.. మరోసారి రెచ్చిపోయిన నార్త్‌ కొరియా అధ్యక్షుడు.
Follow us on

North Korea: నార్త్‌ కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మరోసారి రెచ్చిపోయారు. నిత్యం ఏదో ఒక వివాదాంశంతో వార్తల్లో నిలిచే కిమ్‌ తాజాగా మరోసారి అమెరికాను హెచ్చరించారు. అమెరికా, దక్షిణ కొరియా తమ దేశాన్ని రెచ్చగొడితే అణ్వాయుధాలు ప్రయోగిస్తామని గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. ప్రస్తుతం నార్త్‌ కొరియాలో.. కొరియా యుద్ధం 69వ వార్షికోత్సవాలు ప్యాంగ్యాంగ్‌లో ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. 1950-53 నాటి ఈ యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికులను అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ప్రసగించిన ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

అమెరికా, దక్షిణ కొరియాలకు కిమ్‌ వార్నింగ్ ఇచ్చారు. ఈ రెండు దేశాలు సంయుక్తంగా చేపట్టిన యుద్ధ విన్యాసాలను తప్పు బట్టిన కిమ్‌.. ఆ విన్యాసాలను తమ దేశంపై దండయాత్రకు రిహాల్సల్స్‌గా భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. కొరియా ద్వీపకల్పాన్ని అమెరికా, దక్షిణ కొరియా యుద్ధంలోకి నెడుతున్నాయని ఆరోపించారు. అమెరికా ద్వంద్వ ప్రమాణాలు అనుసరిస్తూ ఉత్తర కొరియాను బూచిగా చూపుతోందని ధ్వజమెత్తారు.

ఈ విషయమై కిమ్‌ ఇంకా మాట్లాడుతూ.. ‘దక్షిణ కొరియా కొత్త అధ్యక్షుడు యున్ సుక్ యోల్‌ యుద్ధ ఉన్మాదిగా ప్రవర్తిస్తున్నారు. యున్‌ అధికారం చేపట్టి నుంచి అమెరికాతో సైనిక సహకారాన్ని బలోపేతం చేసుకుంటున్నారు. మాపై అమెరికా, దక్షిణ కొరియా యుద్ధానికి వస్తే ఉత్తర కొరియాను నాశనం చేస్తాము’ అని వార్నింగ్ ఇచ్చారు. మరి కిమ్‌ చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..