South Africa: కోవిడ్‌-19తో జీవించేందుకు సిద్ధంగా ఉన్నాం.. దక్షిణాఫ్రికా వితండవాదం.. లాక్‌డౌన్‌కు నో..!

|

Jan 17, 2022 | 12:02 PM

South Africa: కొత్త వేరియంట్‌ దాటికి ప్రపంచ దేశాలు గజగజ వణికిపోతుంటే..  కొత్త వేరియంట్ ఒమిక్రాన్ జన్మస్థలమైన దక్షిణాఫ్రికా ప్రభుత్వం..

South Africa: కోవిడ్‌-19తో జీవించేందుకు సిద్ధంగా ఉన్నాం.. దక్షిణాఫ్రికా వితండవాదం.. లాక్‌డౌన్‌కు నో..!
Follow us on

South Africa: కొత్త వేరియంట్‌ దాటికి ప్రపంచ దేశాలు గజగజ వణికిపోతుంటే..  కొత్త వేరియంట్ ఒమిక్రాన్ జన్మస్థలమైన దక్షిణాఫ్రికా ప్రభుత్వం మరిన్ని ఆంక్షలు విధించడానికి బదులు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. కోవిడ్‌ 19తో కలిసి జీవించేందుకు సిద్ధంగా ఉన్నాం.. లాక్‌డౌన్‌ కానీ, క్వారంటైన్‌ ఆంక్షలుగానీ విధించే ప్రసక్తి లేదని ప్రభుత్వం తెలిపింది. పరోక్షంగా ఆర్థిక వ్యవస్థ, జీవనోపాధి, ఇతర సామాజిక అంశాలపై లాక్‌డౌన్‌ ప్రభావాన్ని చూపుతుందన్న భయం ప్రభుత్వాన్ని వెంటాడుతోంది. దాంతో.. ప్రపంచవ్యాప్తంగా విధించిన కోవిడ్‌ -19 ఆంక్షలను గుడ్డిగా అనుసరించకూడదని, స్థానికంగా అవి ఆచరణ యోగ్యంకాదని ప్రభుత్వం పేర్కొంది. తొందరపాటు చర్యలకు పూనుకోకుండా మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ఆచరణయోగ్యమైన నిర్ణయాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ పుట్టిన దక్షిణాఫ్రికాలో కోవిడ్‌ కేసులు కూడా పెరిగిపోతున్నాయి.  ఒక వైపు కరోనా కేసులు, మరో వైపు ఒమిక్రాన్‌ మరింత ఆందోళనకు గురి చేస్తోంది.

ఇప్పటివరకూ 93 వేల కోవిడ్‌ మరణాలు సంభవించగా, 33,60,879 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 1,02,476 కోవిడ్‌ యాక్టీవ్‌ కేసులున్నాయి. మొత్తం 35 లక్షల కోవిడ్‌ 19 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గత ఏడాది నవంబర్‌లో దక్షిణాఫ్రికాలో కోవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వెలుగుచూసింది. దీంతో ప్రస్తుతం కోవిడ్‌ నాలుగో వేవ్‌లో దేశం కొట్టుమిట్టాడుతోంది.

ఇవి కూడా చదవండి:

India Corona: దేశంలో కరోనా కల్లోలం.. భారీగా పెరుగుతున్న పాజిటివిటీ రేటు.. నిన్న ఎన్నంటే..?

CM KCR: మరోసారి లాక్‌డౌన్‌ తప్పదా..? ఈరోజు తెలంగాణ కేబినెట్‌ అత్యవసర భేటీ..