దక్షిణాఫ్రికా(South Africa)లోని క్వాజులు-నాటల్‌లోని తూర్పు ప్రావిన్స్‌లో వరదల(floods) కారణంగా దాదాపు 259 మంది మరణించారని అక్కడి అధికారులు ప్రకటించారు. ఆ దేశ ప్రభుత్వం గతంలో వెల్లడించిన 59 మరణాల సంఖ్య ఇప్పుడు భారీగా పెరిగింది. ఏప్రిల్ 12 నాటికి 250 మృతదేహాలను మార్చురీ తరలించినట్లు అధికారులు చెప్పారు. “మొన్న రాత్రి నాటికి, మా రెండు వేర్వేరు మార్చురీలలో 253 మృతదేహాలు తరలించారు” అని సిమెలన్-జులు చెప్పారు. కొద్దిసేపటి తర్వాత ఆ సంఖ్య పెరిగింది. విపత్తు నిర్వహణ ప్రతినిధి 259 మరణించినట్లు ధృవీకరించారు. చాలా భారీ వర్షం(Heavy Rains) కురిసినట్లు చెప్పారు.
భారీ వర్షం వరదలు, విరిగిపడుతున్న కొండచరియలు
కుండపోత వర్షానికి ఇళ్లు కూలిపోవడంతోపాటు కొండలు విరిగిపడుతున్నాయి. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు బాధితులకు మద్దతు ప్రకటించారు. “అధ్యక్షుడు సిరిల్ రామఫోసా ప్రస్తుతం వరదల ప్రాంతంలోనే ఉన్నారు. అతను నివాసితులతో మాట్లాడారు. సహాయం చేయడానికి అన్ని విధాల కృషి చేస్తున్నట్లు చెప్పారు. స్థానిక ప్రభుత్వ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, చాలా మంది ఆచూకీ తెలియడం లేదు.
ప్రావిన్స్‌లోని కొన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తూనే ఉంది. తూర్పు కేప్‌లోని పొరుగు ప్రావిన్స్‌లో కూడా వరద హెచ్చరికలు జారీ చేశారు. గత కొన్ని రోజులుగా తీర ప్రాంత నగరం, పరిసర ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. దక్షిణాఫ్రికా వెదర్ సర్వీస్ ప్రకారం ఏప్రిల్ 11న 300 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ కురిసింది. ఇది 60 ఏళ్లలో ఒకే రోజులో నమోదైన అత్యధిక వర్షపాతం. ఇదే ప్రాంతంలో గత సంవత్సరం జులైలో హింస, దోపిడీలు చెలరేగడంతో దాదాపు 330 మంది చనిపోయారు. మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జరిగిన అవినీతిపై విచారణకు హాజరుకాకపోవడంతో ఆయన జైలు శిక్ష తర్వాత హింస చెలరేగింది.
Read Also.. Russia Ukraine War: ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యాకు భారీ ఎదురుదెబ్బ.. నల్ల సముద్రంలో పేలడు.. యుద్ధనౌక ధ్వంసం