Viral News: ఒక్క కండోమ్‌ ప్యాకెట్ ధర రూ. 60 వేలు.. ఈ అసాధారణ పరిస్థితి ఎక్కడంటే..

|

Jun 13, 2022 | 4:22 PM

Viral News: అవాంచిత గర్భదారణ, సుఖ వ్యాధులు దరిచేరకుండా ఉండడానికి కండోమ్‌లను ఉపయోగించాలని ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తాయి. కొన్ని దేశాల్లో ప్రభుత్వాలే స్వయంగా ప్రజలకు ఉచితంగా కండోమ్‌లను...

Viral News: ఒక్క కండోమ్‌ ప్యాకెట్ ధర రూ. 60 వేలు.. ఈ అసాధారణ పరిస్థితి ఎక్కడంటే..
Condoms Price
Follow us on

Viral News: అవాంచిత గర్భదారణ, సుఖ వ్యాధులు దరిచేరకుండా ఉండడానికి కండోమ్‌లను ఉపయోగించాలని ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తాయి. కొన్ని దేశాల్లో ప్రభుత్వాలే స్వయంగా ప్రజలకు ఉచితంగా కండోమ్‌లను పంచిపెడుతుంటారు. అలా కాకుండా సొంతంగా కొనుగోలు చేసుకున్నా మహా అయితే రూ. 100లోపే లభిస్తాయి. మరి ఒక్క కండోమ్‌ ప్యాకెట్‌ రూ. 60 వేలు పలికితే. అవును మీరు చదివింది నిజమే.. అయితే ఈ పరిస్థితి ఉంది మన దేశంలో కాదు లేండి వెనిజులాలో. ఈ దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభమే దీనికి కారణం.

వెనిజుల ఆర్థిక సంక్షోభం కారణంగా దేశంలో ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే ఒక్క కండోమ్‌ ప్యాక్‌ భారత కరెన్సీలో ఏకంగా రూ. 60 వేలకు చేరింది. వెనిజులలో ఈ రేంజ్‌లో కండోమ్‌ ధర పెరగడానికి కారణం అక్కడి చట్టాలే. వెనిజులాలో అబార్షన్‌లు చట్ట విరుద్ధం. దీంతో జనాలు పెద్ద ఎత్తున కండోమ్‌లు కొనుగోలు చేస్తున్నారు.

2015 ఐక్యరాజ్యసమితి ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా యువతులు గర్భిణీలున్న దేశాల్లో వెనిజులా ఒకటి. ఈ నేపథ్యంలోనే ఈ దేశంలో అబార్షన్‌ చట్టాలను కఠినతరం చేశాయి. దీంతో పెద్ద ఎత్తున కండోమ్‌లకు డిమాండ్‌ పెరగడంతో ధరలకు రెక్కలొచ్చాయి. ప్రస్తుతం వెనిజులాలో నెలకొన్ని పరిస్థితులపై సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు వైరల్‌ అవుతున్నాయి. కండోమ్‌ ధరలు ఈ రేంజ్‌లో పెరగడంతో ఆ దేశంలో ప్రజలు ఏం చేయలేని స్థితిలో తలలు పట్టుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..