Shireen Abu Akleh: పాలస్తీనాపై కాల్పులతో విరుచుకుపడిన ఇజ్రాయిల్.. మహిళా జర్నలిస్ట్ మృతి..

|

May 11, 2022 | 11:58 AM

ఇజ్రాయెల్ దాడులను కవర్ చేస్తున్నప్పుడు పాలస్తీనాకు చెందిన అల్ జజీరా జర్నలిస్ట్ షిరీన్ అబు అక్లేహ్‌ కు బుల్లెట్లు తగిలాయి. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది.

Shireen Abu Akleh: పాలస్తీనాపై కాల్పులతో విరుచుకుపడిన ఇజ్రాయిల్.. మహిళా జర్నలిస్ట్ మృతి..
Shireen Abu Akleh
Follow us on

Israeli–Palestinian conflict: ఇజ్రాయిల్ – పాలస్తీనా మధ్య దాడులు తీవ్ర స్థాయికి చేరాయి. సరిహద్దు ప్రాంతాలు కాల్పుల మోతతో మార్మోగుతున్నాయి. తాజాగా.. ఇజ్రాయెల్ దళాలు ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో జరిపిన దాడుల్లో పాలస్తీనాకు చెందిన అల్ జజీరా జర్నలిస్ట్ షిరీన్ అబు అక్లేహ్‌ (Shireen Abu Akleh) మృతి చెందింది. దీంతోపాటు పలువురు జర్నలిస్టులు గాయపడినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. బుధవారం జెనిన్ నగరంలో ఇజ్రాయెల్ దాడులను కవర్ చేస్తున్నప్పుడు ఆమెకు బుల్లెట్లు తగిలాయి. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది. పరిస్థితి విషమంగా ఉండంటంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతూ చనిపోయినట్లు పాలస్తీనా తెలిపింది. అబూ అక్లేహ్ తలపై ఇజ్రాయిల్ దళాలు కాల్చినట్లు అల్ జజీరాకు చెందిన ఇబ్రహీం తెలిపారు. మరో పాలస్తీనా జర్నలిస్టు అలీ సమౌదీకి కూడా బుల్లెట్ గాయాలయ్యాయని.. ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికారవర్గాలు తెలిపాయి.

షిరీన్ అబు అక్లే.. జెనిన్‌లో జరుగుతున్న సంఘటనలను కవర్ చేస్తుండగా.. ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌కు ఉత్తరాన ఉన్న నగరంపై దాడి చేసినట్లు పాలస్తీనా ప్రకటించింది. పాలస్తీనాకు చెందిన అబు అక్లేహ్ దాదాపు 22 ఏళ్ల నుంచి అల్ జజీరాలో పనిచేస్తున్నట్లు సంస్థ తెలిపింది. కాగా.. ఈ ఘటనపై ఇజ్రాయెల్ సైన్యం నుంచి ఎలాంటి ప్రకటనా వెలువడలేదు.

ఇదిలాఉంటే.. ఈ ఘటనపై పాలస్తీనా రాయబారి హుసామ్ జోమ్లాట్ మాట్లాడుతూ.. ఇజ్రాయిల్ దళాలు జెనిన్‌లో జర్నలిస్ట్ షిరీన్ అబు అక్లేహ్‌ను హత్య చేశాయని పేర్కొన్నారు. షిరీన్ మంచి జర్నలిస్ట్ అని.. తనకు మంచి స్నేహితురాలని తెలిపారు.

ఇవి కూడా చదవండి

కాగా.. జర్నలిస్టు మృతిపై పలువురు సోషల్ మీడియా ద్వారా దిగ్భ్రాంతి వ్యక్తంచేస్తున్నారు. షిరీన్ అబు అక్లేహ్‌ మృతిపై పలు మీడియా సంస్థలు విచారం వ్యక్తంచేస్తూ.. ఇజ్రాయిల్ తీరుపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read:

Bill Gates: బిల్‌ గేట్స్‌కు కరోనా.. ఐసోలేషన్‌లో ఉన్నానంటూ మైక్రోసాఫ్ట్ దిగ్గజం ట్వీట్..

Sukh Ram Passes Away: కేంద్ర మాజీ మంత్రి పండిట్ సుఖ్ రామ్ కన్నుమూత.. ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ..