Fraud Case: అమెరికాలో కలకలం.. ఫ్రాడ్ కేసులో నేరం అంగీకరించిన నాటా మాజీ అధ్యక్షుడు

Fraud Case: ఈ కేసును అసిస్టెంట్ యూఎస్ అటార్నీ మైఖేల్ జి. పిట్‌మాన్, సాహిబ్ కౌర్ సహాయంతో వాదిస్తున్నారు. ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్, ఎఫ్‌బీఐ దర్యాప్తు సంస్థల విచారణ తర్వాత రాఘవరెడ్డి గోసల వ్యవహారం బయటపడింది. నేరం అంగీకరించడంతో ఈ కేసు తదుపరి..

Fraud Case: అమెరికాలో కలకలం.. ఫ్రాడ్ కేసులో నేరం అంగీకరించిన నాటా మాజీ అధ్యక్షుడు
Fraud Case

Edited By:

Updated on: Oct 07, 2026 | 6:18 PM

Fraud Case: అమెరికాలోని నార్తర్న్ కాలిఫోర్నియాలో భారీ ఫ్రాడ్ కేసు కలకలం రేపింది. నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు డాక్టర్ రాఘవరెడ్డి గోసల నేరం అంగీకరించారు. చారిటబుల్ మ్యాచింగ్ ప్రోగ్రామ్‌లను మోసగించడం, ట్యాక్స్ రిటర్న్‌లను తప్పుగా చూపించడం లాంటి వ్యవహారాల్లో ఆయన ఫెడరల్ కోర్టులో తప్పు ఒప్పుకున్నారు. వైర్ ఫ్రాడ్, అమెరికా ప్రభుత్వాన్ని మోసగించే కుట్ర చేశారని ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి.

లాభాపేక్ష లేని సంస్థను అడ్డం పెట్టుకుని ఆయన ఈ మోసానికి పాల్పడ్డారు. నాటా సంస్థ పేరుతో దేశవ్యాప్తంగా ఉన్న వివిధ యజమానుల నుంచి మిలియన్ల కొద్దీ డాలర్ల ఫ్రాడ్ విరాళాలను ఆయన సేకరించారు. ఈ వ్యవహారానికి సంబంధించి పెన్సిల్వేనియాలోని నార్త్ వేల్స్‌కు చెందిన 65 ఏళ్ల రాఘవరెడ్డి గోసల పై 2026 మే 5న కేసు నమోదు అయింది. ఫెడరల్ కోర్టులో విచారణ జరగ్గా తనపై మోపిన అభియోగాలన్నింటినీ ప్లీ అగ్రిమెంట్ కింద ఆయన అంగీకరించారు.

ఈ కేసును అసిస్టెంట్ యూఎస్ అటార్నీ మైఖేల్ జి. పిట్‌మాన్, సాహిబ్ కౌర్ సహాయంతో వాదిస్తున్నారు. ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్, ఎఫ్‌బీఐ దర్యాప్తు సంస్థల విచారణ తర్వాత రాఘవరెడ్డి గోసల వ్యవహారం బయటపడింది. నేరం అంగీకరించడంతో ఈ కేసు తదుపరి విచారణలో కోర్టు ఆయనకు శిక్ష ఖరారు చేయనుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us