సెల్ఫీ(Selfie)ల ట్రెండ్ వేగంగా పెరుగుతోంది. ప్రజలు ప్రతి సంవత్సరం సగటున 450 సెల్ఫీలు తీసుకుంటున్నట్లు ఓ పరిశోదనలో తేలింది. అయితే ఈ అధ్యయనం ప్రకారం తేల్చిన కొన్ని విషయాలు మాత్రం షాకిస్తున్నాయి. సెల్ఫీల వల్ల ముఖాన్ని పాడుచేసుకుంటున్నట్లు తేల్చారు. యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ సౌత్ వెస్ట్రన్ మెడికల్ సెంటర్ పరిశోధకులు సెల్ఫీలు దిగినప్పుడు, ఆ ఫొటోలోని ముఖంలో కొన్ని తీవ్రమైన మార్పులు వస్తున్నాయంట. అందులో ముఖ్యంగా ముక్కు సాధారణ ఫోటోల కంటే పొడవుగా, వెడల్పుగా కనిపిస్తుందని పేర్కొన్నారు. UKలో ముక్కు శస్త్రచికిత్సను రినోప్లాస్టీ అని కూడా పిలుస్తారు. ఇది కాస్మెటిక్ సర్జరీలో అత్యంత ప్రజాదరణ పొందినది. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, సెల్ఫీల ప్రజాదరణలో, రైనోప్లాస్టీ చేయించుకునే వారి సంఖ్య కూడా పెరిగుతోందంట.
సెల్ఫీల్లో ముఖం తేడాగా కనిపిస్తే.. సర్జరీకి వచ్చేస్తున్నారు..
ఈ అధ్యయన బృందానికి నేతృత్వం వహించిన డాక్టర్ బర్డియా అమిర్లాక్ మాట్లాడుతూ.. ‘సెల్ఫీ హాబీకి, రైనోప్లాస్టీకి ప్రత్యేక సంబంధం ఉంది. సెల్ఫీలలో వ్యక్తుల ముఖాలు తేడగా కనిపించినప్పుడు, వారు శస్త్రచికిత్సకు వస్తున్నారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న 30 మంది వాలంటీర్లు సెల్ఫీలు ముఖాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోవడానికి ప్రయత్నించారు. వాలంటీర్లు 3 అడుగుల ముందు నుంచి రెండు సెల్ఫీలు, డిజిటల్ కెమెరా నుంచి 5 అడుగుల దూరం నుంచి ఒక సెల్ఫీ తీసుకున్నారు. ఈ మూడు సెల్ఫీలు ఒకేసారి తీశారు.
ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం..
సెల్ఫీ డిజిటల్ కెమెరాతో తీసిన ఫోటోతో పోలిస్తే, 12-అంగుళాల దూరం నుంచి తీసిన సెల్ఫీలో ముక్కు 6.4శాతం, 18-అంగుళాల దూరం నుండి తీసిన సెల్ఫీలో 4.3శాతం పొడవుగా కనిపిస్తుంది. 12 అంగుళాల దూరంలో ఉన్న సెల్ఫీలలో గడ్డం పొడవు కూడా సగటున 12శాతం తక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. దీని ఫలితంగా ముక్కు, గడ్డం పొడవు నిష్పత్తి 17శాతం పెరిగింది. సెల్ఫీల్లో చెడుగా కనిపించడం మానసిక ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావం చూపుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
Also Read: Sri Lanka Crisis: అయ్యా.. మా దేశాన్ని రక్షించండి.. ప్రధాని మోదీకి శ్రీలంక ప్రతిపక్ష నేత విజ్ఞప్తి