ఆరిజోనా అతలాకుతలం..చిన్నారి కోసం గాలింపు ముమ్మరం
అమెరికా ఆరిజోనాలో తుపాను బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షాలకు తోడు పెనుగాలులకు అతలాకుతలమవుతోంది. ఇళ్లు, భారీ వృక్షాలు నేలమట్టమవుతున్నాయి. వరద ఉధృతికి వాహనాలు కొట్టుకుపోతున్నాయి. వరద ప్రవాహానికి కొట్టుకుపోతున్న పలువురిని కాపాడారు భద్రతా సిబ్బంది. గిలా కంట్రీలో థాంక్స్ గివింగ్ వేడుకకు హాజరై తిరిగొస్తున్నఓ ట్రక్కు.. వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా..6 ఏళ్ల చిన్నారి గల్లంతైంది. దీంతో ఆమె కోసం విస్త్రుతంగా గాలిస్తున్నాయి రెస్క్యూ టీమ్స్.10 బృందాలుగా విడిపోయి బాలిక కోసం […]
అమెరికా ఆరిజోనాలో తుపాను బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షాలకు తోడు పెనుగాలులకు అతలాకుతలమవుతోంది. ఇళ్లు, భారీ వృక్షాలు నేలమట్టమవుతున్నాయి. వరద ఉధృతికి వాహనాలు కొట్టుకుపోతున్నాయి. వరద ప్రవాహానికి కొట్టుకుపోతున్న పలువురిని కాపాడారు భద్రతా సిబ్బంది.
గిలా కంట్రీలో థాంక్స్ గివింగ్ వేడుకకు హాజరై తిరిగొస్తున్నఓ ట్రక్కు.. వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా..6 ఏళ్ల చిన్నారి గల్లంతైంది. దీంతో ఆమె కోసం విస్త్రుతంగా గాలిస్తున్నాయి రెస్క్యూ టీమ్స్.10 బృందాలుగా విడిపోయి బాలిక కోసం జల్లెడ పడుతున్నారు. హెలికాఫ్టర్స్, గుర్రాలు, డాగ్ స్క్వాడ్, పోలీస్ బలగాలు ఇలా ఆమె కోసం పరిసర ప్రాంతాల్లో అణువణువూ గాలిస్తున్నారు. మరో ఆరుగురిని హెలికాఫ్టర్ ద్వారా రక్షించారు.