వంట గదిలో భారీ శబ్దం.. వెళ్లి చూసే సరికి పేలిన వాషింగ్‌ మెషన్‌..

Washing Machine Exploded గ్యాస్‌ సిలిండర్‌ పేలిందనే విషయం విన్నా.. అలాగే రిఫ్రిజిరేటర్లు కూడా అప్పుడప్పుడు పేలినట్లు వార్తలు విన్నాం.. కానీ వాషింగ్‌ మెషన్‌ పేలిన ఘటన...

వంట గదిలో భారీ శబ్దం.. వెళ్లి చూసే  సరికి పేలిన వాషింగ్‌ మెషన్‌..
Washing Machine

Updated on: Apr 01, 2021 | 10:33 AM

Washing Machine Exploded: గ్యాస్‌ సిలిండర్‌ పేలిందనే విషయం విన్నా.. అలాగే రిఫ్రిజిరేటర్లు కూడా అప్పుడప్పుడు పేలినట్లు వార్తలు విన్నాం.. కానీ వాషింగ్‌ మెషన్‌ పేలిన ఘటన ఎప్పుడైన విన్నారా..?. ఇది నిజమే మొదటి సారిగా వంటగదిలో వాషింగ్‌ మెషన్‌ పేలిన ఘటన స్కాట్లాండ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. లారా బిరెల్‌ అనే మహిళ వంట గదిలో ఉన్న వాషింగ్‌ మెషన్‌ను ఆన్‌ చేసి హాల్‌లో కూర్చుంది. అయితే కొంత సమయం తర్వాత వంటగది నుంచి ఒక్కసారి ఏదో పేలిన శబ్దం వచ్చింది. కిచెన్‌ నుంచి అంతా శబ్దం ఎలా వచ్చిందో చూద్దామని వెళ్లే సరికి అక్కడ వాషింగ్‌ మెషన్‌ పేలిపోయి ఉండటం గమనించింది.

అంతేకాకుండా వాషింగ్‌ మెషన్‌ పేలడం వల్ల కిచెన్‌ మొత్తం చెల్లాచెదురైపోయింది. ఈ ఘటనను లారా తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్టు చేసింది. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలను చూసి ఆమె ఫేస్‌బుక్‌ స్నేహతులు ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా, వాషింగ్‌ మెషన్‌ అసలు ఎలా పేలిందన్న దానిపై క్లారిటీ లేదు. అయితే వాషీంగ్‌ మెషన్‌ను తయారు చేసిన సంస్థకు కూడా ఈ విషయం తెలియడంతో ఘటనపై విచారణ ప్రారంభించారు. వాషింగ్‌ పేలడానికి గల కారణాలపై పరిశీలిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు సిలిండర్లు, రిఫ్రిజిరేటర్లు పేలినట్లు చూశాం. కానీ ఇలా వాషింగ్‌ మెషన్‌ పేలినట్లు ఎక్కడ వినలేదు. ఈ విషయం విన్న పలువురు ఆశ్యర్యపోతున్నారు. వాషింగ్‌ మెషన్‌ పేలడం ఏంటని. ఇలా వాషింగ్‌ మెషన్‌ పేలడంతో భయాందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పటి వరకు ఇలా వాషింగ్‌ మెషన్‌ పేలలేదని, మొదటి సారిగా చూడడమని పలువురు చెప్పుకొంటున్నారు.

 

Washing Machineఇవీ చదవండి: Myanmar Violence: మయన్మార్‌లో ఆగని మారణకాండ.. మిలిటరీ హత్యాకాండలో 500 మందికిపైగా మృతి!

అమెరికాలో మెరిసిన మరో తెలుగు తేజం.. కీలక పదవికి తెలుగు సంతతి మహిళ నామినేట్