Saudi Arabia bans travel : సౌదీ అరేబియా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా మరోసారి కరోనా విజృంభిస్తన్న నేపథ్యంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇదే క్రమంలోనే విదేశీయులు దుబాయ్ చేరుకునే వారిపై అంక్షలు విధిస్తోంది. దాదాపు 20 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేధం విధిస్తున్నట్లు సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రకటించింది. ఈ జాబితాలో భారత్ కూడా ఉండటం గమనార్హం.
కరోనా వైరస్‌ను నియంత్రించేందుకే ఈ కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పడంలేదంటూ అధికారులు వెల్లడించారు. అయితే, సదరు 20 దేశాల్లో ఉన్న సౌదీ పౌరులు, ప్రభుత్వ అధికారులకు ఈ నిషేధం వర్తించదని అధికారుల స్పష్టం చేశారు. కాగా, కరోనా నిబంధనలను పాటించని వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవని సౌదీ ఆరోగ్య శాఖ మంత్రి తాఫిక్ అల్ రబియా స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరు విధిగా కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందేనని ఉత్తర్వులు జారీ చేసింది.
Read Also… ప్రయాణీకులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. శ్రీవారి భక్తులకు బంపరాఫర్.. అదేంటంటే..!