Russia McDonald: ‘వుకోసో ఐ తోచ్చా’.. టేస్ట్ అదిరిపోయింది మచ్చా.. ఎగబడి తింటున్న జనాలు..!

Russia McDonald: మెక్‌డొనాల్డ్స్‌ వెళ్లిపోయిందని నిరాశలో ఉన్న రష్యన్లను సరికొత్త రూపంలో బర్గర్లు పలకరించాయి. కొత్త బ్రాండ్‌తో వచ్చిన బర్గర్ల కోసం తొలిరోజే జనం..

Russia McDonald: ‘వుకోసో ఐ తోచ్చా’.. టేస్ట్ అదిరిపోయింది మచ్చా.. ఎగబడి తింటున్న జనాలు..!
Burgers

Updated on: Jun 14, 2022 | 5:58 AM

Russia McDonald: మెక్‌డొనాల్డ్స్‌ వెళ్లిపోయిందని నిరాశలో ఉన్న రష్యన్లను సరికొత్త రూపంలో బర్గర్లు పలకరించాయి. కొత్త బ్రాండ్‌తో వచ్చిన బర్గర్ల కోసం తొలిరోజే జనం విరగబడ్డారు. ‘వుకోసో ఐ తోచ్చా’.. రష్యన్ భాషలో చెప్పాలంటే దీని అర్థం రుచికరమైన సమయం. ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యాతో తమ వ్యాపారాన్ని మూసేసింది అమెరికా కంపెనీ మెక్​డొనాల్డ్స్. అయితే, బర్గర్ల రుచికి అలవాటు పడ్డ రష్యన్లు ఈ వార్తను జీర్ణించుకోలేకపోయారు. మెక్​డొనాల్డ్స్ ఔట్‌లెట్లను మూసేస్తున్న చివరి రోజుల్లో ఎగబడి మరీ తమ అభిమానాన్ని చాటుకున్నారు.

మెక్​డొనాల్డ్స్ బర్గర్లకు తమ దేశంలో ఉన్న ఆదరణ చూసిన రష్యన్‌ వ్యాపారవేత్త అలెగ్జాండర్ గోవర్ ఈ చైన్‌ ఔట్‌లెట్లను నిర్వహించేందుకు ముందుకొచ్చారు. దీంతో రష్యాలో తమ వ్యాపార యాజమాన్య హక్కులను ఆయనకు అమ్మేసింది. అలెగ్జాండర్ గోవర్ వెంటనే మెక్​డొనాల్డ్స్ బ్రాండ్‌ను తొలగించి ‘వుకోసో ఐ తోచ్కా’ బ్రాండ్‌తో వ్యాపారాన్ని ప్రారంభించేశాడు. మాస్కోలోని పలు చోట్ల ఈ ఔట్లెట్లు ఆదివారం నాడు తెరచుకున్నాయి. గ్రీన్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక బర్గర్‌, రెండు ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ కనిపించేలా డిజైన్‌ చేసిన కొత్త లోగో అందరినీ ఆకట్టకుంటోంది. తొలిరోజునే రష్యన్లు ‘వుకోసో ఐ తోచ్కా’ బర్గర్ల కోసం పోటెత్తారు.

ఇవి కూడా చదవండి

రష్యాలో మెక్​డొనాల్డ్స్‌కు 850 రెస్టారెంట్లతో పాటు 62వేల మంది ఉద్యోగులు ఉన్నారు. వీరందరూ ఇప్పుడు అలెగ్జాండర్ గోవర్ యాజమాన్యం కిందకే వచ్చారు. త్వరలోనే అన్ని ఔట్లెట్లను తిరిగి ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. మెక్​డొనాల్డ్స్ బ్రాండ్‌ మారినా అందులోని మెనూ పాతదే. దీంతో కొత్త కవర్లో పాత బర్గర్లు అని కొందరు చమత్కరిస్తున్నారు. కాగా ‘వుకోసో ఐ తోచ్కా’ మరికొన్ని రుచులను చేర్చబోతోంది.