Russia Ukraine War News: రష్యా వైమానిక దాడులు.. ఉక్రెయిన్ ప్రతిదాడుల నేపథ్యంలో ఉక్రెయిన్‌లో చిక్కుకపోయిన భారతీయులు బిక్కుమని గడుపుతున్నారు. ఉక్రెయిన్‌లో చిక్కుకపోయిన తమ వారి క్షేమం గురించి దిగులు చెందుతో భారత్‌లోని వారి కుటుంబీకులు, సన్నిహితులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న వారిని భారత్‌కు తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌లో చిక్కుకపోయిన భారత పౌరులకు కైవల్‌లోని భారత రాయబార కార్యాలయం కీలక సూచన చేసింది. సరిహద్దు పోస్టుల వద్దనున్న భారత అధికారులతో ముందస్తు సమన్వయం లేకుండా ఉక్రెయిన్ సరిహద్దు పోస్టుల వద్దకు వెళ్లవద్దని సూచించారు. ఉక్రెయిన్ రాజధాని కైవ్‌లోని భారత రాయబార కార్యాలయం ఈ మేరకు భారతీయ పౌరులకు సూచిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.
#UkraineRussiaCrisis All Indian citizens are advised not to move to any of the border posts without prior coordination with GoI officials at border posts: Embassy of India in Kyiv, Ukraine in an advisory to Indian nationals pic.twitter.com/K2Yeu2YxwP
— ANI (@ANI) February 26, 2022
ఉక్రెయిన్‌లో బిక్కుబిక్కుమని గడుపుతున్న తెలుగు విద్యార్థులు
ఉక్రేయిన్ లో చిక్కుకపోయిన తెలుగు విద్యార్థులు బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. సౌత్ ఈస్ట్ ఉక్రెయిన్ లోని జఫ్రోజియా స్టేట్ మెడికల్ వర్సిటీలోనే 10మందికి పైగా తెలుగు విద్యార్థులు ఉండిపోయారు. రాత్రి కాసేపు బంకర్ లో ఆ తర్వాత తిరిగి హాస్టల్ లో విద్యార్థులు గడిపారు. సమాచారం లేకుండా హాస్టల్ నుంచి అడుగుబయటపెట్టొద్దని వర్సిటీ ఆదేశించింది. పరిస్థితి మరింత దిగాజారిందని.. బయట నడవటం వంటివి కూడా చేయొద్దని ఆదేశించింది. దీంతో విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు. పిల్లలను తలుచుకుంటు నిద్రాహారాలు లేకుండా తల్లిదండ్రుల పడిగాపులు కాస్తున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం తమ పిల్లలను దేశానికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఉక్రెయిన్ నుంచి తరలిస్తున్న వారిలో 22 మంది తెలుగు విద్యార్థులు
ఉక్రెయిన్ నుంచి తరలిస్తున్న 470 మంది భారతీయ విద్యార్థుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన 22 మంది విద్యార్థులు ఉన్నారు. అలాగే కేరళ నుంచి 17, తమిళనాడు నుంచి నలుగురు విద్యార్థులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ప.గోదావరి జిల్లా విద్యార్థుల కోసం కంట్రోల్ రూం ఏర్పాటు
ప.గో: ఉక్రేయిన్‌లో ఉన్న జిల్లా విద్యార్థుల కోసం పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. సహాయం కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కంట్రోల్ రూమ్ నెంబర్ 08812-224519కు కాల్ చేయొచ్చని అధికారులు తెలిపారు. విద్యార్థుల సమాచారాన్ని వార్డు, గ్రామ సచివాలయల ద్వారా సేకరించాలని అధికారులకు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశాలు జారీ చేశారు.
విశాఖపట్నం జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
విశాఖపట్నం: ఉక్రెయిన్ లో చిక్కుకున్న విశాఖ జిల్లా వాసులకోసం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 24 గంటలు పనిచేసేలా 0891-2590100 టెలిఫోన్ ఏర్పాటు చేశారు. ఉక్రెయిన్‌లో చిక్కుకపోయిన జిల్లాకు చెందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సాయం కోసం ఈ నెంబర్‌కు కాల్ చేయొచ్చు.
Also Read..
Russia Ukraine War: రాజధాని కీవ్‌పై విరుచుకుపడ్డ రష్యా దళాలు.. కీవ్ ఎయిర్‌పోర్ట్ హస్తగతం!