ఇక్కడ తాగి డ్రైవ్ చేస్తే అంతే సంగతులు.. మీ కారును నేరుగా ఉక్రెయిన్‌కే.. ఎక్కడో తెలుసా!

|

Mar 12, 2023 | 3:39 PM

Latvia donates drunk drivers cars: ప్రతి వారం రెండు డజన్ల కార్లను ఉక్రెయిన్‌కు పంపడానికి అంగీకరించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలను బాగు చేసేందుకు ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

ఇక్కడ తాగి డ్రైవ్ చేస్తే అంతే సంగతులు.. మీ కారును నేరుగా ఉక్రెయిన్‌కే.. ఎక్కడో తెలుసా!
Drunk Drivers Cars
Follow us on

మీరు ఇక్కడ తాగి డ్రైవ్ చేస్తే, పోలీసులు మీ కారును నేరుగా ఉక్రెయిన్‌కు పంపుతారు. నిర్ణయానికి కారణం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది కదూ.. రష్యా – ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ప్రపంచంలోని పెద్ద దేశాలు తమ స్వంత ప్రయోజనాలకు మరల్చుకున్నాయి. ఈ క్రమంలో లాట్వియా తన ప్రజల మద్యం తాగి డ్రైవింగ్ అలవాటును మానిపించడానికి వినూత్న నిర్ణయం తీసుకుంది. ఈ పద్ధతి ఉక్రెయిన్ ప్రజలకు బాగా నచ్చింది.

తాగి డ్రైవింగ్ చేసే వ్యక్తులను సంస్కరించడానికి లాట్వియా కొత్త నిర్ణయం తీసుకుంది. మద్యం సేవించి రోడ్లపైకి వస్తే.. వాహనాలను జప్తు చేయడం ప్రారంభించింది. ఈ నిర్ణయం తర్వాత ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడిన వాహనాల కుప్పలు తెప్పలుగా మారడంతో అక్కడి పోలీస్ స్టేషన్లలో పార్కింగ్ సమస్య తలెత్తింది. ఇప్పుడు ఆ సమస్యను నివారించేందుకు కనిపెట్టిన ప్రత్యేకమైన మార్గం ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నది. నిజానికి, లాట్వియా ఇటీవలి నిర్ణయాలలో ఒకటి మాత్రం ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా మారింది. ఇలా చేయడం ద్వారా, తన ప్రజల చెడు అలవాట్లను మాన్పించడంతో పాటు తన హోదాకు అనుగుణంగా యుద్ధంలో నలిగిపోతున్న ఉక్రెయిన్‌కు కూడా సహాయం చేసినట్లైయితదని భావిస్తోంది.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా సవాళ్లను ఎదుర్కొంటున్న ఉక్రెయిన్ ప్రజలకు సహాయం చేయడానికి లాత్వియా తాగి డ్రైవర్ల నుండి స్వాధీనం చేసుకున్న వాహనాలను పంపాలని నిర్ణయించింది. ఇటువంటి వాహనాలు ఉక్రెయిన్ సైన్యం, ఆసుపత్రులకు చేరవేస్తోంది. లాట్వియాలోని ఇంపౌండ్ లాట్ నుండి ఇటీవల అలాంటి ఏడు వాహనాలను ఉక్రెయిన్‌కు పంపారు. దాదాపు రెండు మిలియన్ల జనాభా ఉన్న ఈ బాల్టిక్ దేశంలో గత రెండు నెలల్లో రక్తంలో ఆల్కహాల్ 0.15 శాతానికి మించి ఉన్నట్లు తేలింది. దీంతో తాగి వాహనాలు నడుపుతున్నవారిపై చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. ఇలా దాదాపు రెండు వందలకు పైగా కార్లను సీజ్ చేశారు.

డ్రంక్ అండ్ డ్రైవ్‌తో రోడ్లపై ఎన్ని వాహనాలు నడుస్తున్నాయో తెలుసుకుంటే ఈ సంఖ్య చాలా భయానకంగా ఉంటుంది. ట్విట్టర్ కాన్వాయ్‌కు లాట్వియా ప్రభుత్వం అటువంటి వాహనాలను ఉక్రెయిన్‌కు పంపిణీ చేసే బాధ్యతను అప్పగించింది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం, ప్రతి వారం రెండు డజన్ల కార్లను ఉక్రెయిన్‌కు పంపడానికి అంగీకరించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలను బాగు చేసేందుకు ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

గత ఏడాది ఫిబ్రవరి 24న రష్యా దాడి చేసిన కొద్ది రోజుల తర్వాత ఉక్రెయిన్‌కు సహాయం చేసేందుకు లాట్వియా ప్రభుత్వం ప్రచారం ప్రారంభించింది. ప్రజలు తమ సామర్థ్యానికి అనుగుణంగా ఉక్రెయిన్ కోసం విరాళాలు ఇస్తున్నారు. అటువంటి ప్రచారం నుండి సేకరించిన రెండు మిలియన్ యూరోలు ఇప్పటికే ఉక్రెయిన్‌కు పంపించారు. అదే సమయంలో, సుమారు 1200 వాహనాలు కూడా ఉక్రెయిన్‌కు చేరవేశారు.

 

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.