Russia-Ukraine War: ఉక్రెయిన్- రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. రష్యా సైనికులు ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే ఉక్రెయిన్ ఎంతో నష్టపోయింది. దాడుల కారణంగా ఎంతో మంది బలయ్యారు. రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ (Ukraine) పోరాడుతోంది. దాడుల నేపథ్యంలో ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin)పై అగ్ర రాజ్యం అమెరికా (America) సహా మరికొన్ని దేశాలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయినా పుతిన్ ఏ మాత్రం పట్టించుకోకుండా ఉక్రెయిన్‌పై బాంబుల వర్షం కురిపిస్తోంది. రోజురోజుకు భీకర దాడులు తీవ్రతరం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) పుతిన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐరోపా పర్యటనలో ఉన్న బైడెన్ చివరి రోజు పోలాండ్‌లోని ఉక్రెయిన్ శరణార్థుల శిబిరాన్ని సందర్శించారు. పుతిన్ రష్యా అధ్యక్షుడిగా ఉండే అర్హత లేదని బైడెన్ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపాయి. పుతిన్ అధ్యక్షుడి నుంచి తప్పించేందుకు అమెరికా తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తోందంటూ దౌత్యవర్గాల్లో చర్చలు మొదలయ్యాయి.
బైడెన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన రష్యా:
పుతిన్‌పై జో బైడెన్ చేసిన వ్యాఖ్యలపై రష్యా ఘాటుగా స్పందించింది. రష్యా అధ్యక్షుడిని దింపేసే అధికారం బైడెన్‌కు ఏ మాత్రం లేదని కౌంటర్ ఇచ్చింది. రష్యాను ఎవరు పాలించాలి అనే విషయాన్ని నిర్ణయించేది బైడెన్ కాదని విరుచుకుపడింది. దీంతో బైడెన్ చేసిన వ్యాఖ్యలపై అమెరికా వైట్ హౌస్ వివరణ ఇచ్చింది. రష్యాలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు బైడెన్ పిలుపు ఇవ్వలేదని వెల్లడించింది. పొరుగు దేశాలపై అధికారం చెలాయించే హక్కు పుతిన్‌కు లేదని చెప్పడంలో భాగంగానే జో బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారని, పుతిన్‌ను గద్దె దింపే అంశంపై మాట్లాడలేదని వైట్‌హౌస్ స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి: