Russia-Ukraine war: ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం వల్ల ధరలు పైపైకి! ఎవరికి లాభం.. ఎవరికి నష్టం..

|

Mar 08, 2022 | 8:02 AM

ముడి చమురు, వంట గ్యాస్‌ ధరలు పెరుగుతాయని, పెరిగిన ధరలతో పేదలకు సమస్యలు ముంచుకొస్తాయన్నారు. ఇక ఇప్పటికే బంగారం ధరలు ఆకాశానికెక్కాయి. గత ఏడేళ్లలో చమురు ధరలు గరిష్ఠ స్థాయికి..

Russia-Ukraine war: ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం వల్ల ధరలు పైపైకి! ఎవరికి లాభం.. ఎవరికి నష్టం..
Russia Ukraine War 2022
Follow us on

Skyrocketing global prices regarding Russia-Ukraine war: ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం అంతర్జాతీయ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రపంచ బ్యాంక్‌ చీఫ్‌ డేవిడ్‌ మాల్ఫాస్‌ (World Bank Chief David Malpass) ఈ యుద్ధాన్ని ఆర్థిక విపత్తుగా (economic catastrophe) అభివర్ణించారు. ప్రపంచ ఆర్థిక వృద్ధిపై యుద్ధ ప్రభావం ఖచ్చితంగా ఉంటుందన్నారు. ముడి చమురు, వంట గ్యాస్‌ ధరలు పెరుగుతాయని, పెరిగిన ధరలతో పేదలకు సమస్యలు ముంచుకొస్తాయన్నారు. ఇక ఇప్పటికే బంగారం ధరలు ఆకాశానికెక్కాయి. గత ఏడేళ్లలో చమురు ధరలు గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. బ్రెంట్ క్రూడ్ USD 112 బ్యారెల్ మార్కును దాటేసింది. యూరోపియన్ యూనియన్ దేశాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ఈ దేశాలతోపాటు మనదేశానికి కూడా యుద్ధం తాలూకుసెగ తగులుతుందని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. గోధుమలు, సోయాబీన్, ఎరువులు, కాపర్‌ (రాగి), ఉక్కు, అల్యూమినియం వంటి వాటి ధరల్లో చోటుచేసుకున్న మార్పులు ఆందోళనకరంగా మారాయి. ఇవేకాకుండా..

మన దేశంలో యుద్ధ ప్రభావం ఇలా..
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఆకాశాన్నంటుతున్న ప్రపంచ మార్కెట్‌ ధరలవల్ల ఈ ఏడాది భారత్ నుంచి గోధుమల ఎగుమతులు పెరిగే అవకాశం ఉంది. భారత్ నుంచి ఏటా దాదాపు 50 లక్షల టన్నుల గోధుమలు ఎగుమతి అవుతున్నాయి. ఈ ఏడాది దాదాపు రూ.70 లక్షల వరకు ఎగుమతులు పెరిగే అవకాశం ఉంది. గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ నుంచి క్వింటా గోధుమలు రూ.2,400 నుంచి 2,450లు పలుకుతున్నాయి. 15 రోజుల క్రితం క్వింటా గోధుమల ధర రూ.2,100ల కంటే కూడా తక్కువగా ఉండింది. ప్రస్తుత ధరల విషయానికొస్తే.. మార్చి మధ్య నుంచి మార్కెట్‌లోకి రానున్న కొత్త గోధుమ పంటకు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) రూ.2,015/క్వింటాల్ కంటే కూడా చాలా ఎక్కువ.

వంట నూనెల ధరల (Edible oil prices)కు రెక్కలు..
కూరగాయల నూనెలు, నూనె గింజల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వీటిల్లో పొద్దుతిరుగుడు, సోయాబీన్ నూనెలు కూడా ఉన్నాయి. మలేషియాలో పామాయిల్ కూడా ఆల్ టైమ్ హైకి చేరుకుంది. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌ల్లో ఆవాలు పండించే రైతులకు ఇది లాభదాయకం. ప్రస్తుతం ఆవాల ధరలు క్వింటాకు రూ. 6,500లు పలుకుతున్నాయి. ఇది కూడా కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) రూ.5,050 కంటే ఎక్కువగా ఉంది.

ఎరువులపై యుద్ధం ప్రభావం ఇలా..
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా నెలకొన్న ఉద్రిక్తత ఎరువుల ధరలపై కూడా ప్రభావం చూపుతోంది. 2020-21లో 5.09 మిలియన్‌ టన్నుల్లో దాదాపు మూడింట ఒక వంతు MOPని బెలారస్ (0.92 mt), రష్యా (0.71 mt) నుంచి దేశానికి దిగుమతి అయ్యాయి. ప్రస్తుతం సరఫరా నిలిచిపోవడంతో.. కెనడా, జోర్డాన్, ఇజ్రాయెల్ వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకోవల్సి వస్తోంది. అంతేకాకుండా కేవలం ఒక నెలరోజుల్లోనే యూరియా, డి-అమోనియం ఫాస్ఫేట్, కాంప్లెక్స్ వంటి ఎరువుల ధరలు అమాంతంగా పెరిగాయి.

Also Read:

DRDO Scholarship 2022: ఏడాదికి రూ.1,86,600ల చొప్పున స్కాలర్‌షిప్‌ అందుకునే అవకాశం.. డోంట్ మిస్‌ ఇట్‌!