‘భారత్‌ తరపున క్షమాపణలు.. ఆ వ్యాఖ్యలు దేశ సంస్కృతిని ప్రతిబింబించవు’

|

Jun 06, 2022 | 2:15 PM

మహమ్మద్‌ ప్రవక్తపై భాజపా మాజీ అధికార ప్రతినిధులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా ఖతార్‌ ఆదివారం ఇండియన్‌ ఎంబసీకి సమన్లు జారీ..

భారత్‌ తరపున క్షమాపణలు.. ఆ వ్యాఖ్యలు దేశ సంస్కృతిని ప్రతిబింబించవు
India Qatar
Follow us on

Qatar summons Indian envoy: మహమ్మద్‌ ప్రవక్తపై భాజపా మాజీ అధికార ప్రతినిధులు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు నిరసనగా ఖతార్‌ ఆదివారం ఇండియన్‌ ఎంబసీకి సమన్లు జారీ చేసింది. ఐతే సదరు వ్యాఖ్యలు భారత ప్రభుత్వ అభిప్రాయాన్ని ప్రతిబింబించవని స్పష్టం చేస్తూ భారత రాయబారి ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా ఈ పరిణామంపై పశ్చిమాసియా దేశాలు తీవ్ర అభ్యతరం వ్యక్తం చేశాయి. ముఖ్యంగా కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా దేశాలు ఈ విషయమై స్పందించాయి. ఖతార్‌ అధికారిక పర్యటనలో భాగంగా భారత ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు ఆ దేశంలో అడుగిడిన కొన్ని గంటల వ్యవధిలోనే దోహా రాయబార కార్యలయం నుంచి భారత విదేశాంగ రాయబారి దీపక్ మిట్టల్‌కు నోట్‌ అందింది. భారత్‌లో అధికారంలో కొనసాగుతున్న పార్టీ ఈ విధమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం విచారకరమని, వాటిని ఖండిస్తున్నట్లు నోట్‌లో పేర్కొంది.

”భిన్నత్వంలో ఏకత్వం సంస్కృతికి అనుగుణంగా భారత ప్రభుత్వం అన్ని మతాలను గౌరవిస్తుంది. ఏ మతాన్ని కించపరచదు. ఒక వర్గాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన ఇద్దరు అధికారిక ప్రతినిధులలో ఒకరిని పార్టీ సస్పెండ్‌ చేయగా, మరొకరిని పార్టీనుంచి బహిష్కరించింది. ఈ విషయమై భారత ప్రభుత్వం తరపున క్షమాపణలు తెలుపుతున్నట్లు” భారత రాయబారి మిట్టల్‌ తెలిపారు.

ఇవి కూడా చదవండి

కాగా ఇంధన, వాణిజ్యం, భద్రత వంటి కీలకమైన రంగాలలో భారత్‌- ఖతార్‌ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగిస్తున్నాయి. ఖతార్‌లో 7,00,000కు పైగా భారత సంతతి పౌరులు నివసిస్తున్నారు. వీరిలో వైద్యం, ఇంజనీరింగ్, విద్య, ఫైనాన్స్, వ్యాపార రంగాల్లో బ్లూ కాలర్ కార్మికులు, నిపుణులు పెద్ద సంఖ్యలో ఉన్నారు.