AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యుద్ధం వేళ ఖతార్ – ఇరాన్ మధ్య కుదిరిన కీలక ఒప్పందం.. అసలు మతలబు అదేనా?

గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడుల నేపథ్యంలో, ఖతార్ - ఇరాన్ మధ్య ఒక నిశ్శబ్ద ఒప్పందం కుదిరినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఒప్పందం గల్ఫ్‌లో సంచలన సృష్టిస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం, ఖతార్ మొదటిసారిగా ఇరాన్‌తో యుద్ధం నుండి అధికారికంగా దూరంగా జరుగుతోంది. అంతేకాకుండా, అమెరికా - ఇరాన్‌ల మధ్య మధ్యవర్తిత్వం వహించబోమని ఖతార్ ఒక ప్రకటనలో తెలిపింది.

యుద్ధం వేళ ఖతార్ - ఇరాన్ మధ్య కుదిరిన కీలక ఒప్పందం.. అసలు మతలబు అదేనా?
Iranian Foreign Minister Abbas Araqchi With The Emir Of Qatar
Balaraju Goud
|

Updated on: Mar 26, 2026 | 1:43 PM

Share

గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడుల నేపథ్యంలో, ఖతార్ – ఇరాన్ మధ్య ఒక నిశ్శబ్ద ఒప్పందం కుదిరినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఒప్పందం గల్ఫ్‌లో సంచలన సృష్టిస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం, ఖతార్ మొదటిసారిగా ఇరాన్‌తో యుద్ధం నుండి అధికారికంగా దూరంగా జరుగుతోంది. అంతేకాకుండా, అమెరికా – ఇరాన్‌ల మధ్య మధ్యవర్తిత్వం వహించబోమని ఖతార్ ఒక ప్రకటనలో తెలిపింది. మార్చి 20వ తేదీ నుండి ఇరాన్ కూడా ఖతార్‌పై దాడి చేయడం ఆపివేసింది. మరోవైపు, ఖతార్, ఇరాన్‌ల మధ్య ఈ ఒప్పందం ఎలా, ఏ విధంగా కుదిరిందనే దానిపై గల్ఫ్ దేశాలలో చాలా ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

ఇజ్రాయెల్ వెబ్‌సైట్ జెఫీడ్ కథనం ప్రకారం, ఖతార్ – ఇరాన్‌ల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం, ఖతార్ చమురు, గ్యాస్ సౌకర్యాలపై దాడి చేయకుండా ఉండేందుకు ఇరాన్‌కు 6 బిలియన్ డాలర్లు చెల్లించేలా ఒప్పందం కుదిరింది. ఈ డబ్బును వాస్తవానికి 2023లో ఖతార్‌కు అమెరికా చెల్లించింది. ఆ సమయంలో, కొంతమంది అమెరికన్ ఖైదీల విడుదలకు బదులుగా ఇరాన్ ఈ డబ్బును అందుకోవాల్సి ఉంది. కానీ ఖతార్ ఆ తర్వాత ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకుంది.

ఇప్పుడు, ఈ ఒప్పందం ప్రకారం, ఖతార్ నుండి ఈ డబ్బు అంతా ఇరాన్‌కు అందుతుంది. ఈ డబ్బును నేరుగా ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌కు అందజేస్తారు. ఇరాన్ తరపున ఈ మొత్తం యుద్ధానికి ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ నాయకత్వం వహిస్తోంది.

ఈ ఒప్పందం వల్ల కలిగే ప్రయోజనాలుః

  1. ఇరాన్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధంలో తాము మధ్యవర్తిత్వం వహించబోమని ఖతార్ విదేశాంగ మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఎందుకంటే, తమతో అసలు ఎందుకు చర్చలు జరపాలో ఇరాన్‌ను ఒప్పించడంలో అమెరికా విఫలమవుతోంది. మధ్యప్రాచ్యంలో ఖతార్‌ను అగ్రశ్రేణి మధ్యవర్తిగా పరిగణిస్తారు. ఆఫ్ఘనిస్తాన్‌తో చర్చలు జరపడంలో అమెరికాకు సహాయం చేసింది ఖతారే. ఆ సమయంలో దోహాలో తాలిబన్లకు, అమెరికాకు మధ్య ఒక ఒప్పందం కుదిరింది.
  2. ఈ యుద్ధం ఖతార్, ఇరాన్‌ల మధ్య జరగడం లేదని ఖతార్ ప్రభుత్వం ఒక ప్రకటన జారీ చేసింది. ఖతార్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్‌పై దాడి చేయదు. ఈ యుద్ధం ఇజ్రాయెల్ కోసం జరుగుతున్నందున, అది అమెరికాకు సహాయం చేయదు. ఖతార్ ఈ సంఘర్షణ నుండి తనను తాను దూరంగా ఉంటున్నట్లు ప్రకటించింది.
  3. మార్చి 20వ తేదీ నుంచి ఇరాన్ ఖతార్‌పై ఎలాంటి పెద్ద దాడులు వేయలేదు. ఖతార్‌పై చివరి పెద్ద దాడి రాస్ లఫాన్‌లో జరిగింది. అప్పటి నుంచి ఇరాన్ ఖతార్ ఇంధన కేంద్రాలపై దాడి జరగలేదు. అయితే, ఖతార్‌పై ఎందుకు దాడి చేయడం లేదనే విషయాన్ని ఇరాన్ వెల్లడించలేదు.
  4. ఇరాన్ దాడుల్లో ఇప్పటివరకు నలుగురు ఖతార్ పౌరులు మరణించగా, 16 మంది గాయపడ్డారు. యుద్ధ సమయంలో ఇరాన్, ఖతార్‌లోని ఎల్‌ఎన్‌జి కేంద్రాలపై పదేపదే దాడులు చేసింది. దీనివల్ల తమ ఉత్పత్తిలో 17 శాతం తగ్గుదల సంభవించవచ్చని ఖతార్ ఎనర్జీ తెలిపింది. మరోవైపు, భారతదేశం, చైనా వంటి దేశాలకు ఖతార్ గ్యాస్‌ సరఫరా చేస్తుంది. అమెరికా కూడా ఖతార్ నుండి గ్యాస్‌ను కొనుగోలు చేస్తుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us