Russia President Putin: రష్యా అధ్యక్షుడు ఎవరు అని ప్రపంచ వ్యాప్తంగా ఏ చిన్న పిల్లాడిని అడిగినా టక్కున పుతిన్ అని చెబుతారు. కారణం ఉక్రెయిన్‌పై పుతిన్ చేపట్టిన దండయాత్ర. యుద్ధం విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ అవకుండా దాడులను కొనసాగిస్తున్న పుతిన్.. ఇప్పుడు మరో విషయంలో వార్తల్లోకెక్కారు. ఓవైపు ప్రపంచ దేశాలు విధించిన ఆంక్షలతో రష్యా ప్రజలు ఆర్థికంగా అవస్థలు పడుతుంటే.. పుతిన్ మాత్రం చాలా ఖరీదైన దుస్తులు ధరించి విమర్శలపాలయ్యారు. సరే దేశాధ్యక్షుడు అంటే కొద్దొ గొప్పొ ఖరీదైన దుస్తులు ధరించే పర్వాలేదులే అనుకుంటారు. కానీ, సంక్షోభ సమయంలో 100 కాదు.. 200 కాదు.. ఏకంగా 14,000 అమెరికన్ డాలర్ల ఖరీదైన డిజైనర్ జాకెట్‌ను ధరించాడు. ఉక్రెయిన్‌పై యుద్ధానికి మద్ధతుగా రాజధాని మాస్కోలో పెద్ద ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న పుతిన్.. జాతినుద్దేశించి ప్రసంగించారు. ఆయన ప్రసంగం సంగతి అటుంచితే.. ఆయన ధరించిన జాకెట్ హైలెట్ అయ్యింది. ఆయన ప్రసంగానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవగా.. అందరి దృష్టి పుతిన్ ధరించిన జాకెట్‌పైనే పడింది. ఎందుకంటే అది అంత కాస్ట్ కాబట్టి.
ఇటాలియన్ లగ్జరీ బ్రాండ్ కంపెనీ లోరో పియానాకు చెందిన ఈ డిజైనర్ జాకెట్ ధర 14 వేల డాలర్లు. ఇది మన భారత కరెన్సీలో అక్షరాలా రూ.10,63,253. అసలే సంక్షోభంతో అట్టుడుకుతున్న వేళ.. ఇంత ఖరీదైన జాకెట్ ధరించడం ఏంటంటూ రష్యా ప్రజలు ఫైర్ అవుతున్నారు. పుతిన్ దుబారా ఖర్చులకు ఈ జాకెట్ నిదర్శనం అంటూ సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోస్తున్నారు. ఇక పుతిన్ జాకెట్ లోపల ధరించిన స్వెట్టర్ ధరను కూడా కౌంట్ చేస్తూ సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురిపించారు. ఆ స్వెటర్ ధర రూ. 3,20,336 ఉంది. ఇంత ఖరీదైన దుస్తులు ఈ సమయంలో ధరించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. అదే సమయంలో మారణహోమం ఆపాలంటూ పుతిన్ చేసిన కామెంట్స్‌పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అసలు మారణ హోమాన్ని మొదలు పెట్టిందే మీరు అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ విధంగా పుతిన్ మరోసారి ప్రజల ఆగ్రహాన్ని చవిచూస్తున్నారు.
While russian people are fighting for food in stores, putin addressed 90000 russians wearing a Loro Piana puffer jacket for 1.5 million rubles. pic.twitter.com/PMBY1yKIWk
— Yana Morozova ?? (@jane_in_vain) March 18, 2022
Also read:
Stretch Marks: స్ట్రెచ్ మార్కులతో ఇబ్బందులు పడుతున్నారా? తేనె తో ఇలా చెక్ చెప్పండి..!
TSRTC: తెలంగాణ ఆర్టీసీపై మరో పిడుగు.. కార్మికులు, ప్రయాణికులపై పడనున్న ప్రభావం..!