Psychologist Daniel Kahneman: ప్రముఖ సైకాలజిస్ట్‌, నోబెల్‌ అవార్డు గ్రహీత డేనియల్‌ కానమన్‌ కన్నుమూత

|

Mar 29, 2024 | 9:20 AM

ప్రపంచ ప్రఖ్యాత మనస్తత్వవేత్త, ఆర్ధికవేత్త, నోబెల్‌ బహుమతి గ్రహీత డేనియల్‌ కానమన్‌ (90) బుధవారం (మార్చి 27) కన్నుమూశారు. ఈ మేరకు ఆయన మృతి చెందిన విషయాన్ని ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీ ప్రకటించింది. ఆర్ధిక శాస్త్రం చదవకపోయినా బిహేవియరల్‌ ఎకనామిక్స్‌కు పర్యాయపదంగా మారారు. ఆయన 1993వ సంవత్సరం నుంచి ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు. ప్రిన్స్‌టన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ అండ్ ఇంటర్నేషనల్ అఫైర్స్‌లో..

Psychologist Daniel Kahneman: ప్రముఖ సైకాలజిస్ట్‌, నోబెల్‌ అవార్డు గ్రహీత డేనియల్‌ కానమన్‌ కన్నుమూత
Psychologist Daniel Kahneman
Follow us on

న్యూజెర్సీ, మార్చి 29: ప్రపంచ ప్రఖ్యాత మనస్తత్వవేత్త, ఆర్ధికవేత్త, నోబెల్‌ బహుమతి గ్రహీత డేనియల్‌ కానమన్‌ (90) బుధవారం (మార్చి 27) కన్నుమూశారు. ఈ మేరకు ఆయన మృతి చెందిన విషయాన్ని ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీ ప్రకటించింది. ఆర్ధిక శాస్త్రం చదవకపోయినా బిహేవియరల్‌ ఎకనామిక్స్‌కు పర్యాయపదంగా మారారు. ఆయన 1993వ సంవత్సరం నుంచి ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు. ప్రిన్స్‌టన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ అండ్ ఇంటర్నేషనల్ అఫైర్స్‌లో సైకాలజీ అండ్ పబ్లిక్ అఫైర్స్ ఎమెరిటస్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆయన రాసిన పుస్తకం ‘థింకింగ్, ఫాస్ట్‌ అండ్‌ స్లో’ ఎంతో ప్రజాదరణ పొందింది. బెస్ట్‌ సెల్లర్ లిస్ట్‌లో ఈ పుస్తకం ఒకటి. ఈ పుస్తకానికి గానూ రచయితగా నోబెల్ బహుమతి పొందారు. స్వప్రయోజనాల కోసం పనిచేసే హేతుబద్ధత కంటే సహజత్వంతోనే ప్రజలు వ్యవహరించే అవకాశం ఎక్కువని ఆయన ఆ పుస్తకంలో పేర్కొన్నారు.’ నాయిస్‌: ఎ ప్లా ఇన్‌ జడ్జిమెంట్‌’ పుస్తకానికి సహరచయితగా ఆయన పేరుపొందారు. 2013లో బరాక్ ఒబామా నుంచి ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడం అందుకున్నారు.

డేనియల్‌ కానమన్‌ సిద్ధాంతాలు సామాజికశాస్త్రాలను చాలా మటుకు మార్చివేశాయని ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ ఎల్డార్‌ షాఫిర్‌ పేర్కొన్నారు. ఆయన మృతి తీరని లోటని అన్నారు. కాగా ఇజ్రాయెల్‌లోని టెల్‌అవీవ్‌లో 1934లో కానమన్‌ జన్మించారు. ఈ ప్రాంతం ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో ఉంది. ఆయన తల్లిదండ్రులు లిథువేనియన్ యూదులు. వీరు 1920 ప్రారంభంలో ఫ్రాన్స్‌కు వలస వచ్చారు. ఆయన తండ్రి ఒక పెద్ద కెమికల్ ఫ్యాక్టరీలో రీసెర్చ్ చీఫ్‌గా పనిచేశారు. ప్రముఖ రచయిత, కాలమిస్ట్ అయిన టిమ్ హార్ట్‌ఫోర్డ్.. కానమన్‌ను సాంఘిక శాస్త్రంలో దిగ్గజంగా అభివర్ణించారు. *కాహ్నెమాన్ మరణం గురించి వినడానికి చాలా బాధగా ఉంది . సాంఘిక శాస్త్రంలో సేవలందించిన బెకర్, షెల్లింగ్, థాలర్, లెవిట్, డుఫ్లో వంటి ఎంతో మందిని ఇంటర్వ్యూ చేశాను. కానీ కాహ్నెమాన్ ఇచ్చిన ఇంటర్వ్యూ వాటికి భిన్నమైంది. ఆయన తనను తాను గురువుగా లేదా ఉపయోగకరమైన సలహాలను అందించే వ్యక్తిగా ఎన్నడూ భావించలేదన్నారు.

ఇటీవల పాడ్‌కాస్ట్‌లో డాక్టర్ స్కాట్ బారీ కౌఫ్‌మాన్.. ఆయనను ఈ తరం సైకాలజిస్టులకు మీరిచ్చే సందేశం ఏమిటని అడగ్గా.. అందుకు సమాధానం చెప్పేందుకు చాలా సంకోచించారు. ‘స్వంత ఆలోచనలతో కూరుకుపోకుండా ఉండటమే’ తానిచ్చే ఏకైక సలహా అని చివరికి చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.