Watch: ఆహ్మదాబాద్ సీన్ రిపీట్.. టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలిన విమానం.. ఎంతమంది చనిపోయాంటే?

సౌతాఫ్రికాలోని వెనిజులాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. PA-31 అనే ఒక ప్రైవేట్ విమానం రన్‌వే నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురైంది. ఆ విమానంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Watch: ఆహ్మదాబాద్ సీన్ రిపీట్.. టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలిన విమానం.. ఎంతమంది చనిపోయాంటే?
Plane Crash

Updated on: Oct 23, 2025 | 3:15 PM

గురువారం సౌతాఫ్రికాలోని వెనిజులాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పారామిల్లో విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన PA-31 అనే ప్రైవేటు విమానం.. కొద్ది సేపట్లోనే ప్రమాదానికి గురైంది. విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో విమానం గాల్లోంచి వేంగంగా దూసుకొచ్చి నేలపై కుప్పకూలింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్‌ వీడియో ప్రకారం.. రన్‌వే ఉనంచి టేకాఫ్‌ అయిన PA-31 కొద్ది క్షణాల్లోనే మంటలు చెలరేగి రన్‌వేపై కుప్పకూలింది. భారీ శబ్ధం రావడంతో అలర్టైన ఎయిర్‌పోర్ట్ సిబ్బంది, ఫైర్ డిపార్ట్‌మెంట్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. కాని అప్పటికే అందులో ప్రయాణిస్తున్న వారిలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

వీడియో చూడండి..

మృతులను టోనీ బోర్టన్, జువాన్ మాల్డోనాడోగా గుర్తించారు. ఇద్దరూ సంఘటనా స్థలంలోనే మరణించగా, మరో ఇద్దరు ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రిలో చేరారు. అగ్నిమాపక దళం, సివిల్ ప్రొటెక్షన్ టీం, బొలివేరియన్ నేషనల్ పోలీస్ (PNB) వెంటనే స్పందించి సహాయ, సహాయ చర్యలను చేపట్టారు.

స్థానిక నివేదికల ప్రకారం, ఆ విమానాన్ని ప్రభుత్వ లాజిస్టిక్స్ కార్యకలాపాల్లో వాడుతున్నట్టు తెలుస్తోంది. పైపర్ చెయెన్ (PA-31T1) మొడల్‌ విమానాన్ని అమెరికన్ కంపెనీ అయిన పైపర్ ఎయిర్‌క్రాఫ్ట్ 1970లో తయారు చేసింది. అయితే ఈ ట్విన్-ఇంజన్ విమానం పనితీరు, భద్రతకు ప్రసిద్ధి చెందింనదిగా పెరున్నపటికీ ప్రమదానికి గురికావడంతో దీనిపై దర్యాప్తు చేపట్టారు అధికారులు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.