జర్మనీని వణికిస్తున్నాయి వరుస టోర్నడోలు. సుడులు సుడులుగా తిరుగుతూ విధ్వంసం సృష్టిస్తున్నాయి. బలమైన టోర్నడోల ధాటికి పశ్చిమ జర్మనీ బెంబేలెత్తిపోతోంది. నార్త్ రైన్ వెస్ట్‌పాలియాలోని పలు నగరాలు కకావికలమైపోతున్నాయి. ముఖ్యంగా పెడెర్‌బోర్న్ నగరంలో బీభత్సం సృష్టిస్తున్నాయి భారీ టోర్నడోలు. సుడిగాలుల విధ్వంసానికి ఒకరు మృతి చెందగా..43మందికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన 10మందిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భీకర గాలుల ధాటికి పలు భవనాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. చాలా చోట్ల ఇళ్ల పై కప్పులు ఎగిరిపోయాయి. భారీ వృక్షాలు నేలమట్టమయ్యాయి. చుట్టుముట్టిన సుడిగాలుల ధాటికి కార్లు పల్టీలు కొట్టాయి.
గంటకు 50 కి.మీ వేగంతో వచ్చిన సుడిగాలుల ధాటికి వస్తువులన్నీ అంతెత్తున ఎగిరిపడ్డాయి. టోర్నడోలు సుడులు సుడులుగా తిరుగుతూ బీభత్సం సృష్టించడంతో వాహనదారులు బెంబేలెత్తిపోయారు. రోడ్లపై అడ్డంగా పడిపోయిన చెట్లను తొలగించే చర్యలు కొనసాగుతున్నాయి. చాలా చోట్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడిందని పోలీసులు తెలిపారు. బెర్లిన్ — జర్మనీలోని కొన్ని ప్రాంతాలలో తుఫాను మూడు టోర్నడోలను సృష్టించినట్లు ఆ దేశ వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ, మధ్య జర్మనీలో భారీ వర్షాలు, వడగళ్ళు, బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. పశ్చిమ రాష్ట్రమైన నార్త్ రైన్-వెస్ట్‌ఫాలియాలోని ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచించారు. పునరుద్ధరణ పనులకు ఆటంకం కలిగించకుండా ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచించారు. పెనుగాలుల ప్రభావం ఇంకా వీడలేదని హెచ్చరించారు.
Roller in Paderborn ist praktisch völlig zerstört #paderborn #Tornado #Unwetter pic.twitter.com/MxdFPRiD8f
— Der Doctor (@Der_Doctor) May 20, 2022
మరోవైపు న్యూరేమ్‌బెర్గ్‌కు దక్షిణంగా ఉన్న లేక్ బ్రోంబాచ్ వద్ద తుఫాను కారణంగా ఓ చెక్క గుడిసె కూలిపోవడంతో 14 మంది గాయపడినట్టు బవేరియా అధికారులు వెల్లడించారు. ఐరోపాలో టోర్నడోల విధ్వంసం సర్వసాధరణం అంటున్నారు అక్కడి అధికారులు. US 2011 నుండి 2020 వరకు సంవత్సరానికి సగటున 1,173 టోర్నడోలను ఎదుర్కొందని చెప్పారు.. ఐరోపాలో 256 సుడిగాలులు వచ్చాయి. యూరోపియన్ రష్యా ఏటా 86 సుడిగాలులను ఎదుర్కోని అగ్రస్థానంలో ఉండగా, జర్మనీ ఏటా సగటున 28 వరకు సుడిగాలుల బీభత్సంతో రెండవ స్థానంలో నిలుస్తోంది.