ఇథియోపియా పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగానికి మిన్నంటిన హర్షధ్వానాలు.. తొలి విదేశీ నేతగా రికార్డ్

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇథియోపియా పర్యటన ముగించుకుని, ఒమన్‌కు చేరుకున్నారు. గురువారం (డిసెంబర్ 18)నాడు ఒమన్‌తో ఫ్రీ ట్రేడ్‌ అగ్రిమెంట్‌ చేసుకోనున్నారు. ఇథియోపియా పార్లమెంట్‌లో ప్రధాని మోదీ ప్రసంగానికి హర్షధ్వానాలు మిన్నంటాయి. వ్యవస్థ గతంలోనే బందీగా ఉంటే ప్రపంచం ముందుకు సాగలేదని ప్రధాని మోదీ అన్నారు.

ఇథియోపియా పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగానికి మిన్నంటిన హర్షధ్వానాలు.. తొలి విదేశీ నేతగా రికార్డ్
Pm Modi Addresses Ethiopian Parliament

Updated on: Dec 17, 2025 | 10:13 PM

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇథియోపియా పర్యటన ముగించుకుని, ఒమన్‌కు చేరుకున్నారు. గురువారం (డిసెంబర్ 18)నాడు ఒమన్‌తో ఫ్రీ ట్రేడ్‌ అగ్రిమెంట్‌ చేసుకోనున్నారు. ఇథియోపియా పార్లమెంట్‌లో ప్రధాని మోదీ ప్రసంగానికి హర్షధ్వానాలు మిన్నంటాయి. వ్యవస్థ గతంలోనే బందీగా ఉంటే ప్రపంచం ముందుకు సాగలేదని ప్రధాని మోదీ అన్నారు.

ఇథియోపియా పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ఆయన ప్రసంగానికి అక్కడి ప్రజాప్రతినిధులు 50 సార్లకు పైగా కరతాళధ్వనులు చేశారు. ప్రధాని ఇతర దేశాల పార్లమెంట్‌లో ప్రసంగించడం ఇది 18వ సారి. దశాబ్దాలుగా ఇథియోపియా అభివృద్ధి ప్రయాణంలో వేలాది మంది భారత టీచర్లు కీలక పాత్ర పోషించారని ప్రధాని అన్నారు. జాతి నిర్మాణంలో భాగస్వాములుగా నిలిచి ఇథియోపియన్ల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. రెండు దేశాల రాజ్యాంగంలో ప్రారంభ పదాలు ఒక్కటిగా ఉన్నాయని ప్రధాని తెలిపారు.

ఈ సందర్భంగా ఇథియోపియా అత్యున్నత పౌరపురస్కారాన్ని తనకు అందించడంపై ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. గ్రేట్‌ ఆనర్‌ నిషాన్‌ ఆఫ్‌ ఇథియోపియాను ప్రధాని మోదీ అందుకున్నారు. ఒక విదేశీ ప్రభుత్వాధినేతకు ఈ బిరుదు ఇథియోపియా అందించడం ఇదే మొదటిసారి. ఇక మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ చివరి దేశం ఒమన్‌కు వెళ్లారు. రాజధాని మస్కట్‌లో ఆయనకు ఘనస్వాగతం లభించింది. ఎయిర్‌పోర్టులో సైన్యం సమర్పించిన గౌరవ వందనాన్ని స్వీకరించారు. సుల్తాన్‌తో భేటీ అయ్యారు. అక్కడి భారతీయులు ప్రధానికి సంప్రదాయరీతిలో స్వాగతం పలికారు. మస్కట్‌లో రేపు భారత్‌-ఒమన్‌ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు జరగనున్నాయి.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..