PM Modi: ప్రధానికి మోదీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన రాబర్ట్ ఫికో.. వైరల్ అవుతున్న వీడియో!

భారత ప్రధాని మోదీ స్లొవేకియా పర్యటనలో ఒక ఆసక్తికరమైన, స్నేహపూర్వక దృశ్యం ఆవిష్కృతమైంది. తమ దేశ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ స్లొవేకియా పీఎం సర్‌ప్రైజ్ ఇచ్చారు.. తాను బహుమతిగా ఇచ్చిన బూడిద రంగు జాకెట్‌తో అక్కడికి ఎంట్రీ ఇచ్చిన రాబర్ట్ ఫికోను మోదీతో సరదాగా ముచ్చటించారు.దీంతో ఇద్దరూ ఒకే కలర్‌లో జాకెట్‌లో కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది.

PM Modi: ప్రధానికి మోదీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన రాబర్ట్ ఫికో.. వైరల్ అవుతున్న వీడియో!
Pm Modi Slovakia Visit

Updated on: Jun 15, 2026 | 10:12 PM

భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం స్లొవేకియా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. అయితే 1993లో స్లొవేకియాకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఒక భారత ప్రధాని ఆ దేశంలో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ చారిత్రాత్మక పర్యటనలో భాగంగా స్లొవేకియా ప్రధాని రాబర్ట్ ఫికోతో మోదీ జరిపిన సమావేశం ఇరు దేశాల మధ్య ఉన్న ఆత్మీయ సంబంధాన్ని ప్రతిబింబించింది.

అయితే బ్రాటిస్లావాలో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ఒక సరదా సందర్భం చోటుచేసుకుంది. ప్రధాని మోదీ తనకు బహుమతిగా ఇచ్చిన బూడిద రంగు స్లీవ్‌లెస్ జాకెట్‌ను రాబర్ట్ ఫికో వైట్ షర్ట్‌పై ధరించి హాజరయ్యారు. సాధారణంగా విదేశీ పర్యటనల్లో మోదీ ధరించే సిగ్నేచర్ స్టైల్ జాకెట్ ఇది. అయితే, అదే సమయంలో ప్రధాని మోదీ కూడా దాదాపు అదే షేడ్ ఉన్న జాకెట్ ధరించడంతో ఇద్దరి కలర్ థీమ్ ఒకేలా మారింది.

మోదీ చేసిన పోస్ట్ ఇదిగో..


దీనిపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. మన కలర్ కాంబినేషన్ సరిగ్గా సరిపోయింది అని ఫికోతో సరదాగా వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియోను మోదీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ప్రధాని ఫికో నేను బహుమతిగా ఇచ్చిన జాకెట్‌ను ధరించారు. ఈ రోజు మా జాకెట్ రంగులు కూడా కలిశాయి అని రాసుకోచ్చారు. అనంతరం ఇరు నేతలు కలిసి ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్‌ను కూడా సందర్శించారు.

ఇక స్లొవేకియా పర్యటనలో భాగంగా ఆదివారం అక్కడికి చేరుకున్న ప్రధాని మోదీకి ఘనస్వాగతం లభించింది. సోమవారం రాబర్ట్ ఫికోతో సమావేశమైన ప్రధాని మోదీ కీలక ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకున్నారు. భారత్-స్లొవేకియా దేశాలు తమ సంబంధాలను సమగ్ర భాగస్వామ్య స్థాయికి పెంచుకుంటూ, ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరించడానికి 11 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. మోదీ, ఫికోల చర్చల అనంతరం వలసలు, డిజిటల్ టెక్నాలజీ, రక్షణ వంటి పలు రంగాలలో ఈ ఒప్పందాలు జరిగాయి.

ఇక ఈ పర్యటన తర్వాత జూన్ 16-17 తేదీలలో ఫ్రాన్స్‌లోని ఎవియాన్‌లో జరగబోయే జి7 సదస్సులో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. అక్కడ ఆయన ఆర్థిక వృద్ధి, ప్రపంచ భాగస్వామ్యాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి అంశాలపై జి7 దేశాల నాయకులు, భాగస్వామ్య దేశాలు, అంతర్జాతీయ సంస్థలతో చర్చలు జరుపనున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us