
ఐదు దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్‌కి చేరుకున్నారు. గోథెన్‌బర్గ్‌లో ఆ దేశ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టెర్సన్ మోదీకి ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మోదీ సైనిక వందనం స్వీకరించారు. అంతకుముందు మోదీ విమానం స్వీడన్ గగనతలంలోకి రాగానే స్వీడిష్ గ్రిపెన్ ఫైటర్ జెట్లు ఎస్కార్ట్‌గా నిలిచాయి. ఈ వీడియో నెట్టింట స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారింది. స్వీడన్‌లో ప్రవాస భారతీయులు సైతం ప్రధాని మోదీకి ప్రత్యేక స్వాగతం పలికారు.. దీనికి సంబంధించిన వీడియో సైతం నెట్టింట వైరల్ గా మారింది.. ఈ టూర్‌లో ప్రధాని మోదీ స్వీడిష్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టెర్సన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అలాగే యూరోపియన్ బిజినెస్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీ సమావేశంలో పాల్గొంటారు. ఈ పర్యటనతో భారత్, యూరప్ మధ్య పెట్టుబడి సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని ట్వీట్‌లో ఆకాంక్షించారు మోదీ. 2018 తర్వాత మోదీకి ఇది మొదటి స్వీడన్ సందర్శన. భారత్‌కు డీప్ టెక్, రక్షణ, ఆవిష్కరణలు, గ్రీన్ ట్రాన్సిషన్ రంగాల్లో ఎన్నో అవకాశాలతో పాటు యూరప్‌తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అమలులోకి వచ్చిన సమయంలో ఈ టూర్ అత్యంత వ్యూహాత్మకం అంటున్నారు విశ్లేషకులు. మోదీ పర్యటన భారత ఆర్థిక వికాసం, స్వయం సమృద్ధి, గ్లోబల్ సప్లై చైన్ బలోపేతానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ చెబుతోంది.
మోదీ పర్యటన భారత్‌ను టెక్నాలజీ హబ్‌గా.. గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ డెస్టినేషన్‌గా మార్చడంలో సహయపడుతుంది. రెసిలియంట్ సప్లయ్ చైన్స్, ఎనర్జీ సెక్యూరిటీ, స్టార్టప్‌లు, స్కిల్ డెవలప్‌మెంట్‌లో భాగస్వామ్యం ఏర్పడుతుంది. వోల్వో, సాబ్ లాంటి కంపెనీలు ఇప్పటికే భారత్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఇది ఉద్యోగాలు, ఎగుమతులు, ఆర్థిక వృద్దిని పెంచనుంది. మోదీ నాయకత్వంలో భారత్ విదేశీ విధానం బలమైన భాగస్వామ్యాలు.. ఇన్నోవేషన్, సస్టైనబుల్ డెవలప్‌మెంట్‌పై దృష్టి సారిస్తోంది. స్వీడన్‌తో ఈ సహకారం దేశాన్ని వికసిత్ భారత్ 2047 లక్ష్యం వైపు ముందుకు నడిపిస్తుంది. ఈ పర్యటన భారత్ యూరప్‌లో ఎక్కువ ఇన్‌వెస్ట్‌మెంట్, టెక్ ట్రాన్స్‌ఫర్ ఆకర్షించనుంది. మోదీ గ్లోబల్ సౌత్ నాయకుడిగా.. ఇండో పసిఫిక్, యూరప్ మధ్య వారధిగా పనిచేస్తుంది.
నెక్స్ట్ మోదీ నార్వే పర్యటన అత్యంత విశేషంగా నిలవనుంది. 43ఏళ్ల తర్వాత భారత ప్రధాని నార్వే వెళ్లడం ఇదే తొలిసారి. 19న నార్వే రాజుతో పాటు ప్రధానితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అదే సమయంలో ఓస్లోలో జరిగే 3వ భారత్- నార్డిక్ సమ్మిట్‌లో మోదీ పాల్గొంటారు. డెన్సార్మ్, ఫిన్లాండ్, ఐస్లాండ్ ప్రధానులు ఈ సమ్మిట్‌కు హాజరవుతారు. మే 20న మోదీ ఇటలీ చేరుకుంటారు. ప్రధాని జార్జియా మెలోనితో కలిసి జాయింట్ స్ట్రాటజిక్ యాక్షన్ ప్లాన్ 2025-29 అమలుపై సమీక్ష నిర్వహిస్తారు. రక్షణ, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో ఇటలీతో భారత్ సంబంధాలను పర్యటన మరింత పటిష్టం చేయనుంది. ఫైనల్‌గా ఐరోపా దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో ఈ పర్యటన భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి పోస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.