G20 Summit: బాలి చేరుకున్న ప్రధాని మోదీ.. సంప్రాదాయ పద్ధతిలో స్వాగతం..

|

Nov 14, 2022 | 9:51 PM

జి 20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇండోనేషియా రాజధాని బాలి చేరుకున్నారు. ఆయనకు అక్కడ సంప్రాదాయ స్వాగతం లభించింది. ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించడానికి..

G20 Summit: బాలి చేరుకున్న ప్రధాని మోదీ.. సంప్రాదాయ పద్ధతిలో స్వాగతం..
PM MODI Landed in Indonesia
Follow us on

జి 20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇండోనేషియా రాజధాని బాలి చేరుకున్నారు. ఆయనకు అక్కడ సంప్రాదాయ స్వాగతం లభించింది. ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించడానికి, ఈ సదస్సు సందర్భంగా ప్రపంచ నేతలతో ప్రధాని సమావేశమవుతారని ప్రధానమంత్రి కార్యాలయం ట్విట్టర్ లో తెలిపింది. బాలి సంప్రాదాయం ప్రకారం విమానశ్రయంలో ప్రధాని నరేంద్రమోదీని స్వాగతించారు. రెండు రోజుల జి 20 శిఖరాగ్ర సదస్సు మంగళవారం ఉదయం ప్రారంభమవుతుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, బ్రిటీష్ ప్రధాన మంత్రి రిషి సునక్ తో సహా 20 దేశాల, యూరోపియన్ యూనియన్‌లకు చెందిన అధిపతులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. జీ 20 సదస్సులో పాల్గొనడంతో పాటు కీలక నేతలతో ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొంటారు. కోవిడ్-19, ఆర్థిక పునరుద్ధరణ, రష్యా-ఉక్రెయన్ యుద్ధం, ఐరోపా సంక్షోభం, ఇంధన భద్రత, ఆహార భద్రత సవాళ్లు, ద్రవ్యోల్బనం, ఆర్థిక మాంద్యం వంటి అంశాలపై జీ20 దేశాలు చర్చించనున్నాయి.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌, ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్‌ మాక్రాన్‌, జర్మన్‌ ఛాన్స్‌లర్‌ ఓలఫ్‌ షోల్జ్‌తోపాటు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌లు జి 20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మాత్రం ఈ సమావేశాలకు హాజరు కావడం లేదని తెలుస్తోంది.అమెరికా, చైనా దేశాల అధ్యక్షులు బైడెన్‌, జిన్‌పింగ్‌ ..మొదటిసారి.. జీ-20 సమావేశంలో ఒకే వేదికపై కలవనున్నారు. ఈ సదస్సులో వీరి సమావేశం ప్రత్యేకంగా జరగనుంది. ఉక్రెయిన్‌ యుద్ధం, తైవాన్‌ అంశం, ట్రేడ్‌ వార్, దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తతలు, చైనా సాంకేతికతపై యూఎస్‌ విధించిన పరిమితుల నేపథ్యంలో..కొన్నేళ్లుగా ఈ అగ్రదేశాల మధ్య సంబంధాలు దిగజారాయి. ప్రస్తుత భేటీలో వీరిమధ్య ఈ అంశాలు చర్చకు రానున్నట్లు తెలుస్తోంది.

సదస్సులో ప్రధాన విశేషమేంటంటే..ప్రపంచంలో శక్తిమంతమైన కూటమిగా పేరుగాంచిన జీ-20 నిర్వహణ బాధ్యతలను డిసెంబరు 1న ఇండోనేషియా నుంచి భారత్‌ స్వీకరించనుంది. వచ్చే ఏడాది జీ20 సమ్మిట్ ఇండియాలోని కశ్మీర్‌లో జరగనుంది. ఇండోనేషియా అధ్యక్షుడి నుంచి ప్రధాని మోదీ లాంఛనప్రాయంగా..జీ 20 అధ్యక్ష బాధ్యతలను స్వీకరిస్తారు. ఈ ప్రక్రియ బాలీలో సదస్సు ముగింపు వేళ జరగనుంది.. ఈ గౌరవంతో ప్రపంచ దేశాల నడుమ భారత్‌ పరపతి మరింత పెరగనుంది..ఇది భారతీయులకు ఎంతో గర్వకారణం.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..