PM Modi US Visit: అమెరికా పర్యటన చాలా ప్రత్యేకమైనది.. ఈజిప్టు వెళ్లే ముందు ప్రధాని మోడీ ఆసక్తికర ట్వీట్..

|

Jun 24, 2023 | 10:35 AM

PM Modi Egypt Visit: మూడు రోజుల అమెరికా పర్యటనను విజయవంతంగా పూర్తిచేసుకున్న ప్రధాని మోదీ.. ఇవాళ ఈజిప్ట్‌కు పయనమయ్యారు. అక్కడ ప్రధాని మోడీ రెండు రోజులపాటు పర్యటిస్తారు. మోదీ రాక కోసం ఈజిప్ట్‌ ప్రెసిడెంట్‌ అబ్దుల్‌ ఫతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

PM Modi US Visit: అమెరికా పర్యటన చాలా ప్రత్యేకమైనది.. ఈజిప్టు వెళ్లే ముందు ప్రధాని మోడీ ఆసక్తికర ట్వీట్..
Pm Modi Us Visit
Follow us on

PM Modi Egypt Visit: మూడు రోజుల అమెరికా పర్యటనను విజయవంతంగా పూర్తిచేసుకున్న ప్రధాని మోదీ.. ఇవాళ ఈజిప్ట్‌కు పయనమయ్యారు. అక్కడ ప్రధాని మోడీ రెండు రోజులపాటు పర్యటిస్తారు. మోదీ రాక కోసం ఈజిప్ట్‌ ప్రెసిడెంట్‌ అబ్దుల్‌ ఫతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాదాపుగా మూడు దశాబ్దాల తర్వాత భారత ప్రధాని ఈజిప్టులో పర్యటించడం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. ఈజిప్ట్ చేరుకున్న తర్వాత ప్రధాని మోదీ అక్కడి నాయకులు, ప్రవాస భారతీయులతో వరుసగా భేటీ కానున్నారు. దాదాపు అరగంటపాటు అల్-హకీమ్ మసీదులో గడపనున్నారు. తన ఈజిప్ట్ పర్యటన సందర్భంగా, ప్రధాని మోదీ మొదటి ప్రపంచ యుద్ధంలో ఈజిప్ట్ కోసం అత్యున్నత త్యాగం చేసిన భారతీయ సైనికులకు నివాళులు అర్పించేందుకు హెలియోపోలిస్ వార్ గ్రేవ్ స్మశానవాటికను కూడా సందర్శించనున్నారు. ముఖ్యంగా, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసి ఆహ్వానం మేరకు PM మోడీ ఈజిప్ట్ సందర్శిస్తున్నారు.

అయితే.. ఈజిప్టు పర్యటనకు ముందు.. అమెరికా పర్యటన విజయవంతంపై ప్రధాని మోడీ కీలక వీడియోను పంచుకున్నారు. ‘‘చాలా ప్రత్యేకమైన అమెరికా పర్యటనను ముగించాను.. అక్కడ నేను భారతదేశం-USA స్నేహానికి ఊపందుకునే ఉద్దేశ్యంతో అనేక కార్యక్రమాలు.. ప్రముఖులతో పలు సమావేశాల్లో పాల్గొన్నారు. రాబోయే తరాలకు మంచి భవిష్యత్తును అందించడానికి.. మంచి ప్రదేశంగా మార్చడానికి మన దేశాలు కలిసి పనిచేస్తాయి” ప్రధాన మంత్రి అని మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

కాగా, అంతకముందు వాషింగ్టన్‌లోని రీగన్ సెంటర్‌లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. రీగన్ సెంటర్‌కు చేరుకున్న ప్రధాని మోదీకి విదేశీ భారతీయులు ఘనస్వాగతం పలికారు..ఆ ఆడిటోరియం మొత్తం భారత్‌ మాతాకీ జై నినాదాలతో మారుమోగింది. దీని తర్వాత ప్రముఖ సింగర్‌ మేరీ మిల్బెన్ భారతదేశ జాతీయ గీతాన్ని ఆలపించారు. ‘భారతదేశ అభివృద్ధిలో ఎన్నారైల పాత్ర’ అనే అంశంపై ఎన్నారైలను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ.. మీరు ఈ హాలులో భారతదేశం పూర్తి చిత్రాన్ని రూపొందించారన్నారు. అమెరికాలో ‘మినీ ఇండియా’పుట్టుకొచ్చిందనీ, ఇక్కడ’ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ చిత్రాన్ని ప్రదర్శించినందుకు మీ అందరినీ అభినందిస్తున్నానన్నారు మోదీ. ఈ కొత్త ప్రయాణం మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్ కోసం గొప్ప సహకారమన్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..