PM Modi London: లండన్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం…రెండు రోజుల పాటు యూకేలో పర్యటన

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాలుగు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ఆయన తొలుత బ్రిటన్‌ చేరుకున్నారు. యూకేలో ఆయన రెండు రోజుల పర్యటిస్తారు. లండన్ విమానాశ్రయంలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం లభించింది. ఈ పర్యటన భారత్ - యుకె దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చాలా దోహదపడుతుందని...

PM Modi London: లండన్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం...రెండు రోజుల పాటు యూకేలో పర్యటన
Modi Arrives London

Updated on: Jul 24, 2025 | 7:13 AM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాలుగు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ఆయన తొలుత బ్రిటన్‌ చేరుకున్నారు. యూకేలో ఆయన రెండు రోజుల పర్యటిస్తారు. లండన్ విమానాశ్రయంలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం లభించింది. ఈ పర్యటన భారత్ – యుకె దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చాలా దోహదపడుతుందని అన్నారు ప్రధాని. మన ప్రజలకు శ్రేయస్సు, వృద్ధి ఉద్యోగ సృష్టిని పెంచడంపై దృష్టి ఉంటుందని చెప్పారు. ప్రపంచ పురోగతికి బలమైన భారతదేశం-యుకె స్నేహం చాలా అవసరమని అన్నారు. UK లోని భారతీయ సమాజం నుండి వచ్చిన హృదయపూర్వక స్వాగతం నన్ను కదిలించిందని చెప్పారు. భారతదేశ పురోగతి పట్ల వారి అభిమానం మక్కువ నిజంగా నా హృదయాన్ని తాకిందని ప్రధాని ట్వీట్‌ చేశారు.

ప్రధాని మోదీ తన లండన్‌ పర్యటనలో ప్రధాని కౌంటర్ కీర్ స్టార్మర్‌తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించి, బలోపేతం చేసే మార్గాలపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. ప్రాంతీయ, ప్రపంచ సంబంధిత అంశాలపై ఇద్దరు నేతలు తమ అభిప్రాయాలను పంచుకుంటారు. భారత్ నుంచి పారిపోయిన ఆర్థిక నేరగాళ్లను ఇండియాకు అప్పగించడంపై చర్చిస్తారు

జూలై 24న సంతకం చేయనున్న భారత్- యూకేల స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయనున్నారు. ఈ మేరకు బ్రిటన్‌ మంత్రివర్గం ఇప్పటికే ఆమోదం తెలిపింది. భారత్‌-యూకేల మధ్య ఈ వాణిజ్య ఒప్పందం కోసం జరిపిన చర్చలు ముగిసినట్లు ఇరు దేశాలు మే 6న ప్రకటించాయి. 2030 నాటికి ఈ రెండు ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్యాన్ని 120 బిలియన్ డాలర్లకు రెట్టింపు చేసేదిగా ఈ ఒప్పందం ఉంది. తోలు, పాదరక్షలు, దుస్తులు వంటి ఉత్పత్తుల ఎగుమతిపై పన్నులను తొలగించాలని, బ్రిటన్ నుండి విస్కీ, కార్ల దిగుమతులను చౌకగా మార్చాలని ఈ వాణిజ్య ఒప్పందంలో పొందుపర్చారు.

భారత్‌-యూకేల ఈ ఒప్పందంలో వస్తువులు, సేవలు, ఆవిష్కరణ, మేధో సంపత్తి హక్కులు తదితర అంశాలను ప్రతిపాదించారు. 2024-25లో యూకేకి భారతదేశ ఎగుమతులు 12.6 శాతం పెరిగాయి. దిగుమతులు 2.3 శాతం మేరకు పెరిగాయి. భారత్‌-యూకేల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2022-23లో20.36 యూఎస్‌ బిలియన్‌ డాలర్ల నుండి 2023-24లో 21.34 యూఎస్‌ బిలియన్‌ డాలర్లకు చేరకుంది. జూలై 25-26 తేదీలలో మాల్దీవుల పర్యటన కోసం వెళ్లే ముందు, ప్రధాని మోదీ రాజు చార్లెస్ IIIని కూడా కలిసే అవకాశం ఉంది.