ఫైజర్ టీకాపై ప్రజల్లో ఆందోళనలు.. ఈ సమస్యలు ఉన్నవారు టీకా వేసుకోవద్దంటూ సూచనలు..

|

Dec 10, 2020 | 5:45 AM

కరోనా మహమ్మారిని ఎదుర్కొనే టీకా వచ్చిందని అంతా సంతోషంగా ఉన్న వేళ.. మరో ఇబ్బంది వచ్చి పడింది జనాలకు. ఫైజర్ టీకా..

ఫైజర్ టీకాపై ప్రజల్లో ఆందోళనలు.. ఈ సమస్యలు ఉన్నవారు టీకా వేసుకోవద్దంటూ సూచనలు..
Follow us on

కరోనా మహమ్మారిని ఎదుర్కొనే టీకా వచ్చిందని అంతా సంతోషంగా ఉన్న వేళ.. మరో ఇబ్బంది వచ్చి పడింది జనాలకు. ఫైజర్ టీకా అందరికీ శ్రేయస్కరం కాదని ప్రస్తుతం వస్తున్న ఫలితాలను బట్టి అర్థమవుతోంది. తాజాగా ఇదే విషయాన్ని బ్రిటన్ ఔషధ నియంత్రణ సంస్థ స్పష్టం చేసింది. ఆహార, ఔషధ, ఇతర అలర్జీలు ఉన్నవారెవరూ ఫైజర్ వ్యాక్సిన్‌ను వేసుకోవద్దంటూ బ్రిటన్ ఔషధ నియంత్రణ సంస్థ అధికారులు సూచించారు. అలర్జీ ఉన్న వారు టీకాను వేసుకోవడం ద్వారా సైడ్ ఎఫెక్ట్‌లు వచ్చే ఆస్కారం ఉందన్నారు. కాగా, బ్రిటన్ వ్యాప్తంగా ఫైజర్ టీకా ను వేస్తున్న విషయం తెలిసిందే. తొలుత 80 ఏళ్లు పైబడిన వారికి, వైద్య సిబ్బందికి, వృద్ధాశ్రమాల సిబ్బందికి వ్యాక్సిన్ ఇస్తున్నారు. అయితే ఈ వ్యాక్సిన్ తీసుకున్న కొందరిలో సైడ్ ఎఫెక్ట్స్ కనిపించాయి. దీంతో వారంతా కంగారు పడ్డారు. వెంటనే వారికి చికిత్స అందించడంతో వారంతా ఇప్పుడు కోలుకుంటున్నారు. అయితే ఫైజర్ టీకా వేసుకున్నాక సైడ్ ఎఫెక్ట్స్ రావడంతో మిగతా వారు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన బ్రిటన్ ఔషధ నియంత్రణ అధికారులు అలర్జీలు ఉన్నవారు టీకా వేసుకోవద్దంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కాగా, యూకేలో కరోనా టీకా కార్యక్రమంలో ఇంకా కొనసాగుతూనే ఉంది.