భారత వాయుసేన దాడులు.. పాకిస్థాన్‌లో చమురు సంక్షోభం.. రాజధానిలో పెట్రోల్ బంకులు క్లోజ్..

భారత్‌ దాడితో కుదేలవుతున్న పాక్‌ను ఇప్పుడు చమురు కొరత వేధిస్తోంది. ఇస్లామాబాద్ రాజధాని టెరిటరీ అడ్మినిస్ట్రేషన్ రాజధాని నగరంలోని అన్ని పెట్రోల్, డీజిల్ ఫిల్లింగ్ స్టేషన్లను రాబోయే 48 గంటల పాటు పూర్తిగా మూసివేయాలని తక్షణ ఉత్తర్వు జారీ చేసింది. శనివారం ఉదయం 6 గంటల నుంచి..

భారత వాయుసేన దాడులు.. పాకిస్థాన్‌లో చమురు సంక్షోభం.. రాజధానిలో పెట్రోల్ బంకులు క్లోజ్..

Updated on: May 10, 2025 | 1:18 PM

భారత వైమానిక దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న పాక్‌కు మరో సంక్షోభం వచ్చిపడింది. భారత్‌ దాడితో కుదేలవుతున్న పాక్‌ను ఇప్పుడు చమురు కొరత వేధిస్తోంది. ఇస్లామాబాద్ రాజధాని టెరిటరీ అడ్మినిస్ట్రేషన్ రాజధాని నగరంలోని అన్ని పెట్రోల్, డీజిల్ ఫిల్లింగ్ స్టేషన్లను రాబోయే 48 గంటల పాటు పూర్తిగా మూసివేయాలని తక్షణ ఉత్తర్వు జారీ చేసింది. శనివారం ఉదయం 6 గంటల నుంచి 48 గంటల పాటు ఇస్లామాబాద్‌లోని అన్ని పెట్రోల్‌ బంకులను మూసివేస్తున్నట్టుగా అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. అయితే, పెట్రోల్ బంకులు మూసి వేయడానికి గల కారణాలు ఏంటనే విషయంపై స్పష్టమైన వివరాలు మాత్రం తెలిసి రాలేదు.  కాగా, పాక్‌లోని 4 ఎయిర్ బేస్‌లపై భారత్ దాడి చేసింది. దీంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

 

ఇవి కూడా చదవండి