Ghost Woman: పగలు బొమ్మ.. రాత్రయితే దెయ్యం.. హైవేపై జనాలను భయపెడుతున్న రూపం

|

Jan 19, 2022 | 12:09 PM

Ghost Woman: బర్మింగ్‌హామ్‌ (Birmingham)లో వింత ఘటన జనాలను భయభ్రాంతులను చేస్తుంది. యూకే (UK)లోని బర్మింగ్‌హమ్‌-వోర్‌సెయిస్టర్‌ సరిహద్దులోని (Birmingham-Worceister border) హైవేపై ఉన్న..

Ghost Woman: పగలు బొమ్మ.. రాత్రయితే దెయ్యం.. హైవేపై జనాలను భయపెడుతున్న రూపం
Ghost Woman In Uk Haighway
Follow us on

Ghost Woman: బర్మింగ్‌హామ్‌ (Birmingham)లో వింత ఘటన జనాలను భయభ్రాంతులను చేస్తుంది. యూకే (UK)లోని బర్మింగ్‌హమ్‌-వోర్‌సెయిస్టర్‌ సరిహద్దులోని (Birmingham-Worceister border) హైవేపై ఉన్న చెక్‌పోస్ట్‌ దగ్గర ఒక శాండ్‌విచ్‌ ట్రక్కు ఉంది. అక్కడ నిర్వాహకులు ఏర్పాటు చేసిన చెంబ్‌ మీద ఒక రూపాన్ని చూసి జనం వణికిపోతున్నారు. గత పదేళ్లుగా ఆ రూపం అక్కడక్కడే తిరుగుతోంది. ఆ రూపం పేరు ‘బెట్టీ’.. పక్కనే పిల్లల్ని వేసుకుని తిరిగే ఓ వీల్‌ ఊయల కూడా ఉంటుంది. పగలు బెంచ్‌ మీద కనిపించే ఆ రూపం.. రాత్రిపూట దెయ్యంగా మారుతుందనే ప్రచారం నడుస్తుంది. అందుకే ఈ దారికి కూడా ‘బెట్టీ బైపాస్‌’ అని పేరొచ్చింది.

Voice : బిడ్డను కోల్పోయిన ఆ తల్లి దెయ్యంగా మారి.. అలా హైవేపై తిరుగుతోందని, ఎవరో ఆమెను యాక్సిడెంట్‌ చేసి చంపేశారని, కాదు కాదు.. ఆమె భర్తే ఆమెను చంపేశాడని.. ఇలా రకరకాల ప్రచారాలు నడిచాయి. ఈలోపు ఆ నోటా ఈ నోటా ఈ దెయ్యం కథ.. దెయ్యాల మీద అన్వేషణ చేసే వాళ్లకు, అంతర్జాతీయ మీడియా హౌజ్‌ దృష్టికి చేరింది. ఈ మిస్టరీని చేధించాలని ప్రయత్నించారు. విషయం తెలిసి పగలబడి నవ్వుకున్నారు. కారణం.. అదొక ప్రాక్టికల్‌ జోక్‌ కాబట్టి! బెట్టీ ఒక షోకేజ్‌ బొమ్మ. దానిని ఆ శాండ్‌విచ్‌ ట్రక్‌ యజమాని ఓ ఛారిటీ షాప్‌ నుంచి ఆ షోకేజ్‌ బొమ్మను కొనుక్కొచ్చి.. దానికి బెట్టీ అనే పేరు పెట్టి రోజూ దానిని రకరకాల యాంగిల్స్‌లో అక్కడి బెంచ్‌ల మీద కూర్చోబెట్టేవాడు. అలా పదేళ్లు గడిచిపోయింది. ఈలోపు హైవే మీద వెళ్లే చాలామంది.. ప్రత్యేకించి రాత్రిళ్లు ఆ బొమ్మను చూసి వణికిపోయేవాళ్లట. పైగా అది అక్కడక్కడే ఉండడం, నిక్‌ చెప్పిన కల్పిత కథలతో అదొక దెయ్యం అని బలంగా ఫిక్స్‌ అయిపోయారు. అలా బెట్టీ కథ చుట్టుపక్కల పాకేసింది. ప్రాక్టికల్‌ జోక్స్‌తో ఇంట్లో వాళ్లను ఫూల్స్‌ చేసే నిక్‌.. జనాలందరినీ భయపెట్టాలనే ఉద్దేశంతోనే ఈ ప్రయత్నం చేశాడు. అయితే పగటిపూట ఆ ఫుడ్‌ ట్రక్‌ దగ్గర ఆగిన కొందరు.. బెట్టీ గురించి అడిగినప్పుడు వాళ్లకు ఆ బిడ్డ పెరిగి.. స్కూల్‌కు వెళ్తోందని కథలు చెప్పి బురిడీ కొట్టించేవాడు. కొంతమంది ఆ అనాథ బిడ్డకుసాయం చేయడానికి ముందుకొచ్చారట.. చివరికి బొమ్మ అని తెలుసుకుని ఆ శాండ్‌విచ్‌ ట్రక్‌ యజమాని కి వార్నింగ్‌ ఇచ్చి బెట్టీతో ఫోటోలు దిగి వెళ్లిపోయారట. మొత్తానికి పదేళ్లపాటు జనాలను బురిడీ కొట్టించాడు ఈ పెద్దాయన.

 

Also Read:  ఏపీ స్కూల్స్ లో కరోనా కలకలం.. ఒక్కరోజు లోనే భారీగా కోవిడ్ బారిన పడిన టీచర్స్..