Property Dispute: ఆస్తి పంపకాల గొడవలు.. తల్లీకూతుళ్లను సజీవంగా సమాధి చేసిన బంధువులు!

బంధువుల మధ్య ఆస్తి తగాదాలు చిరిగి చిరిగా గాలివానగా మారాయి. ఆస్తిపంపకాల గొడవలో తల్లీబిడ్డలను గదిలో బంధించి గోడకట్టి సజీవంగా సమాధి చేశారు. ఈ వ్యవహారం పోలీసుల వరకు వెళ్లడంతో ఈ అమానవీయ సంఘటన వెలుగు చూసింది. పోలీసులు వచ్చి గోడ బద్దలు కొట్టడంతో బాధితులను సురక్షితంగా రక్షించగలిగారు..

Property Dispute: ఆస్తి పంపకాల గొడవలు.. తల్లీకూతుళ్లను సజీవంగా సమాధి చేసిన బంధువులు!
Property Dispute

Updated on: Jul 01, 2024 | 5:05 PM

ఇస్లామాబాద్‌, జులై 1: బంధువుల మధ్య ఆస్తి తగాదాలు చిరిగి చిరిగా గాలివానగా మారాయి. ఆస్తిపంపకాల గొడవలో తల్లీబిడ్డలను గదిలో బంధించి గోడకట్టి సజీవంగా సమాధి చేశారు. ఈ వ్యవహారం పోలీసుల వరకు వెళ్లడంతో ఈ అమానవీయ సంఘటన వెలుగు చూసింది. పోలీసులు వచ్చి గోడ బద్దలు కొట్టడంతో బాధితులను సురక్షితంగా రక్షించగలిగారు. పాకిస్థాన్‌లోని హైదరాబాద్‌ నగరంలోని లతిఫాబాద్‌ ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం..

హైదరాబాద్‌లోని లతీఫాబాద్ నంబర్ 5 ఏరియాలో నివాసం ఉంటున్న ఓ మహిళకు వరుసకు బావ అయిన సుహైల్‌ అనే వ్యక్తి తన కుమారులతో కలిసి ఆస్తి వివాదం విషయమై గతకొంతకాలంగా తీవ్రంగా వేధిస్తున్నారు. ఆస్తి తగాదాల్లో భాగంగా మహిళను, టీనేజ్‌లో ఉన్న ఆమె కుమార్తెను ఆ గదిలో బంధించి పూర్తిగా గోడ కట్టేశారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే అక్కడకు వెళ్లి, గోడను కూల్చివేసి బాధితులను రక్షించారు. తన భావ సుహైల్‌, ఆయన కుమారులు తనను వేధిస్తున్నారని, తమ ఇంటి పత్రాలను బలవంతంగా తీసుకుని.. వాటిని ఇవ్వకుండా వేధిస్తున్నారని బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు.

ఈ ఘటనపై హైదరాబాద్‌ సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఎస్‌ఎస్‌పీ) డాక్టర్‌ ఫరూఖ్‌ లింజార్‌ ఏఆర్‌వై మీడియాతో మాట్లాడుతూ.. కేసుపై దర్యాప్తు ప్రారంభించామని, ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిపై కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, తగిన శిక్ష పడేలా చేస్తామని, వీలైనంత త్వరగా వారిని అరెస్టు చేస్తామని ఆయన చెప్పారు. మున్ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.