
శత్రుదేశం పాకిస్తాన్ రక్షణ రంగంలోకి మరో అస్త్రం చేరింది. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన తైమూర్ అనే క్రూయిజ్ క్షిపణిని శనివారం విజయవంతంగా పరీక్షించినట్టు పాకిస్తాన్ వైమానిక దళాలు ప్రకటించాయి. శనివారం నిర్వహించిన ఈ ప్రయోగంలో తైమూర్ క్షిపణి 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను విజయవంతంగా చేధించినట్టు పాక్ పేర్కొంది. ఈ పరీక్ష సక్సెస్ అవ్వడం, దేశ వైమానిక, రక్షణ సమర్థత విషయంలో కీలక మైలురాయి అని పాక్ సైనిక వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులను సైతం తట్టుకుంటూ శత్రు క్షిపణులను ఎదుర్కోవడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుందని పాక్ వర్గాలు చెబుతున్నాయి.
పాకిస్తాన్ తైమూర్’ క్రూయిన్ క్షిపణి ప్రత్యేకతలు
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.