Pakistan PM Imran Khan: ఇమ్రాన్ ఓ పిచ్చోడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన పాక్ ప్రధాని రెండో భార్య..

|

Apr 04, 2022 | 5:08 PM

Pakistan PM Imran Khan Ex-Wife: పాకిస్తాన్‌లో రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. పాక్‌ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ ప్రస్తుతం అవిశ్వాస తీర్మానాన్ని ఎదురుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన మాజీ భార్య, పాత్రికేయురాలు రెహమ్ ఖాన్ మరో సంచలన వ్యాఖ్యలు చేశారు.

Pakistan PM Imran Khan: ఇమ్రాన్ ఓ పిచ్చోడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన పాక్ ప్రధాని రెండో భార్య..
Reham Khan Pakistan Pm Imra
Follow us on

పాకిస్తాన్‌లో (Pakistan)రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. పాక్‌ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ (Imran Khan)ప్రస్తుతం అవిశ్వాస తీర్మానాన్ని ఎదురుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన మాజీ భార్య, పాత్రికేయురాలు రెహమ్ ఖాన్ మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇమ్రాన్ ఓ పిచ్చోడు అంటూ కాంమెట్ చేశారు. ఇమ్రాన్ ఇప్పుడో గ‌త చ‌రిత్ర అని అన్నారు. న‌యా పాకిస్తాన్ పేరుతో పేర్చిన చెత్తను శుభ్రం చేయాల‌ని, దీని కోసం అంతా తననో క‌లిసి ప‌నిచేయాల‌ని ఆమె అన్నారు. ఇమ్రాన్‌కు సామ‌ర్థ్యం, తెలివి లేద‌ని రెహ‌మ్ విమ‌ర్శించారు. ఇమ్రాన్ చేసిన ప్రసంగాన్ని రెహ‌మ్ తీవ్రంగా విమ‌ర్శిస్తూ.. మీరు ప్రధాని కాన‌ప్పుడే పాక్ ఉన్నతంగా ఉంద‌ని అంటూ సెటైర్లు వేశారు. ఇమ్రాన్ ఖాన్ చాలా అహంభావి.. అతను తన కోసం దేశాన్ని గొందరగోళంలో పడేయటమే కాదు.. దేశాన్ని అస్థిర పరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. అతనికి చట్టాలపై గౌరవం లేదు. పట్టాలు తప్పిన ఓ వ్యక్తితో పాక్‌లో తాజా పరిస్థితులపై ఆమె ట్విట్టర్‌ వేదికగా స్పందించారు.

ఇమ్రాన్‌కు మూడు పెళ్లిళ్లు..

1995లో బ్రిటన్‌ బిలియనీర్‌ కుమార్తె జెమీమా గోల్డ్‌స్మిత్‌ను వివాహమాడిన ఇమ్రాన్‌.. తొమ్మిదేళ్ల తర్వాత ఆమెతో విడిపోయారు. 2015 జనవరిలో బీబీసీ జర్నలిస్ట్‌ రెహమ్‌ ఖాన్‌ను రెండో పెళ్లి చేసుకున్నా ఇమ్రాన్‌.. ఆమెతో అక్టోబర్‌లో విడిపోయింది. తొమ్మిది నెలలకే వీరి వివాహ బంధం తెగిపోయింది. ఇక మూడోదిగా మతగురువైన బుష్రా మనేకాను ఇమ్రాన్‌ 2018 ఫిబ్రవరిలో పెళ్లాడారు. సరిగ్గా మూడు నెలలు కూడా తిరక్కముందే బుష్రా.. ఇమ్రాన్‌తో విడిపోయారు.

ఇదిలావుంటే.. చివరి బంతి వరకు పోరాడతానన్న పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్.. సిసలైన ‘మ్యాచ్​’లో విపక్షాలకు షాకిచ్చారు. అవిశ్వాస తీర్మానం పార్లమెంట్​లో తిరస్కరణకు గురికాగా.. అనంతరం ప్రసంగించిన ఇమ్రాన్.. సభను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సిఫార్సు చేస్తూ దేశ అధ్యక్షుడికి లేఖ రాసినట్లు చెప్పారు. దేశంలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగాలని అన్నారు. ప్రజలంతా ఎన్నికలకు సిద్ధమవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని ఇమ్రాన్ సిఫార్సు మేరకు.. పాకిస్థాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ జాతీయ అసెంబ్లీని రద్దు చేశారు. ఈ నేపథ్యంలో.. 90 రోజుల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు పాకిస్తాన్ మంత్రి హబీబ్ ప్రకటించారు.

ఇదిలావుంటే.. రాజకీయ అస్థిరత, రాజ్యాంగం సంక్షోభం పాకిస్తాన్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. అవిశ్వాసం నుంచి బయటపడేందుకు జాతీయ అసెంబ్లీ అంటే అక్కడి పార్లమెంట్‌ను రద్దు చేస్తూ మాస్టర్‌ స్ట్రోక్‌ ఇచ్చానని ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ భావిస్తున్నారు. ఇన్నాళ్లు మిత్రదేశంగా ఉన్న అమెరికాను ఇప్పుడు పాక్‌ పాలక పక్షం కొరకరాని కొయ్యగా భావిస్తోంది. అమెరికా అండ చూసుకొని విపక్షాలు ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్రలు పన్నాయని ఇమ్రాన్‌ పార్టీ PTI ఆరోపిస్తోంది. అటు జాతీయ అసెంబ్లీని రద్దు చేయడంపై విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ఇమ్రాన్‌ సర్కారును పడదోసేందుకు తగిన సంఖ్యాబలం తమ దగ్గరుందని అంటున్నాయి.

ఇవి కూడా చదవండి: Hyderabad Traffic Police: దర్శకుడు త్రివిక్రమ్‌ కారు తనిఖీ.. జరిమానా విధించిన పోలీసులు

Lemon Price: సామాన్యుడి జోబును పిండేస్తున్న నిమ్మ.. రాకెట్‌లా పైపైకి దూసుకుపోతున్న ధర..