ఇస్లామాబాద్ మసీదులో భారీ పేలుడు.. అంతకంతకూ పెరుగుతున్న మృతుల సంఖ్య..!

పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో భారీ పేలుడు సంభవించింది. ఒక మసీదులో శుక్రవారం ప్రార్థనలు జరుగుతుండగా బాంబు పేలింది. చాలా మంది మరణించినట్లు సమాచారం. పేలుడు చిత్రాలలో శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఇది ఆత్మాహుతి దాడిగా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. పోలీసులు, సైనిక బృందాలు సంఘటనా స్థలానికి పెద్ద ఎత్తున చేరుకున్నాయి.

ఇస్లామాబాద్ మసీదులో భారీ పేలుడు.. అంతకంతకూ పెరుగుతున్న మృతుల సంఖ్య..!
Islamabad Mosque

Updated on: Feb 06, 2026 | 3:23 PM

పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో భారీ పేలుడు సంభవించింది. ఒక మసీదులో శుక్రవారం ప్రార్థనలు జరుగుతుండగా బాంబు పేలింది. చాలా మంది మరణించినట్లు సమాచారం. పేలుడు చిత్రాలలో శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఇది ఆత్మాహుతి దాడిగా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. పోలీసులు, సైనిక బృందాలు సంఘటనా స్థలానికి పెద్ద ఎత్తున చేరుకున్నాయి. సహాయక చర్యలు ముమ్మరం చేశారు

స్థానిక మీడియా ప్రకారం, ఇస్లామాబాద్ గ్రాండ్ మసీదుగా పిలువబడే కస్ర-ఎ-ఖాదీజతుల్ కుబ్రా మసీదులో పేలుడు సంభవించింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజ్ వైరల్‌గా మారింది. హఠాత్తు పరిణామంతో జనం అటు ఇటుగా పరిగెడుతున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ముందు జాగ్రత్త చర్యగా ఇస్లామాబాద్‌లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు, సైనిక , రెస్య్కూ బృందాలు పెద్ద ఎత్తున చేరుకుని సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. గాయపడ్డవారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. అయితే ఇప్పటివరకు బాధ్యులుగా ఎవరు ప్రకటించలేదు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల తెలియాల్సి ఉంది.

గాయపడిన వారిని పాకిస్తాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (PIMS)m CDA ఆసుపత్రికి తరలించారు. పిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సూచనల మేరకు, ఆసుపత్రిలో అత్యవసర పరిస్థితిని ప్రకటించామని ఒక ప్రతినిధి ధృవీకరించారు. ప్రధాన అత్యవసర, ఆర్థోపెడిక్, బర్న్ సెంటర్, న్యూరాలజీ విభాగాలను సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. ఇదిలావుంటే, మూడు నెలల క్రితం, నవంబర్ 11, 2025న, ఇస్లామాబాద్‌లోని G-11 ప్రాంతంలోని జిల్లా, సెషన్స్ కోర్టు భవనం వెలుపల ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఆ పేలుడులో 12 మంది మరణించగా, 30 మందికి పైగా గాయపడ్డారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..