పాకిస్తాన్ పార్లమెంట్ లో విశ్వాస పరీక్ష, 178 ఓట్లతో నెగ్గిన ప్రధాని ఇమ్రాన్ ఖాన్

|

Mar 06, 2021 | 3:28 PM

పాకిస్తాన్ పార్లమెంట్ లో జరిగిన విశ్వాస పరీక్షలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నెగ్గారు. 342 మంది సభ్యులున్న దిగువ సభలో ఆయనకు 178 ఓట్లు వచ్చాయి. సాధారణ మెజారిటీకి 172 ఓట్లు వస్తే చాలు..

పాకిస్తాన్  పార్లమెంట్ లో విశ్వాస పరీక్ష, 178 ఓట్లతో నెగ్గిన ప్రధాని ఇమ్రాన్ ఖాన్
Follow us on

పాకిస్తాన్ పార్లమెంట్ లో జరిగిన విశ్వాస పరీక్షలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నెగ్గారు. 342 మంది సభ్యులున్న దిగువ సభలో ఆయనకు 178 ఓట్లు వచ్చాయి. సాధారణ మెజారిటీకి 172 ఓట్లు వస్తే చాలు.. పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ఆదేశాలపై పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశపరిచారు. విశ్వాస పరీక్షను విపక్షాలు బహిష్కరించాయ మొత్తం 11 పార్టీలతో కూడిన  ఈ కూటమి బాయ్ కాట్ చేసింది. గత బుధవారం జరిగిన సెనేట్ ఎన్నికల్లో ఆర్ధికమంత్రి అబ్దుల్ హఫీజ్ షేక్ ఓడిపోవడంతో ఇక తను దిగువసభలో విశ్వాస పరీక్షను ఎదుర్కోవాలని ఇమ్రాన్ ఖాన్ నిర్ణయించారు. ఆయన రాజీనామా చేయాలనీ విపక్షాలు డిమాండ్ చేశాయి. ఒక సందర్భంలో ఆయన రాజీనామా చేయవచ్చునని వార్తలు కూడా వచ్చ్చాయి. కాగా విదేశాంగ మంత్రి మహమ్మద్ ఖురేషీ.. ఈ సభ ఈ ప్రధాని ప్రభుత్వం పట్ల విశ్వాస తీర్మానాన్ని ప్రకటిస్తోందంటూ ఏకవాక్య తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

పాలక సంకీర్ణ కూటమికి చెందిన 181 మంది సభ్యులు పార్లమెంటులో ఉన్నారు. ఒకరి రాజీనామాతో ఇది 180 కి తగ్గింది. అటు ప్రతిపక్షాల నుంచి 160 మంది సభ్యులు దిగువ సభలో ఉన్నారు. అయితే పాక్ లోని పరిణామాలను అన్ని దేశాలు జాగ్రత్తగా గమనిస్తున్నాయి. ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేసిన పక్షంలో తలెత్తే పరిణామాలను ఇవి మదింపు చేస్తున్నాయి.. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ నెగ్గారని కానీ  తాము బాయ్ కాట్ చేశామని విపక్షాలు పేర్కొంటున్నాయి. తాము మళ్ళీ సమావేశమై తమ భవిష్యత్ కార్యాచరణను నిర్దేషించుకుంటామని 11 పార్టీల కూటమి నేతలు స్పష్టం చేస్తున్నారు . సెనేట్ ఎన్నికల ఫలితాలు ఈ ప్రభుత్వానికి గుణపాఠం నేర్పమని వారు పేర్కొన్నారు.

 

మరిన్ని ఇక్కడ చదవండి:

బీజేపీలో చేరిన మరో తృణమూల్ కాంగ్రెస్ నేత, సువర్ణ అధ్యాయమని వ్యాఖ్య

Women’s Day 2021: సంప్రదాయాలు, ఆచారాలను ఎదిరించి చిత్ర పరిశ్రమలో తమదైన ముద్రవేసిన నటీమణుల గురించి తెలుసుకుందాం