గాజాలో ధీనస్థితి..తిండినీళ్లు లేక.. ఎటు చూసినా శవాల గుట్టలే.. మృతదేహాలను గుర్తించలేక అవస్థలు..

|

Oct 16, 2023 | 2:42 PM

ఈ సమయంలో ప్రపంచం మానవత్వాన్ని కోల్పోయినట్లు కనిపిస్తోంది. గాజాలో ప్రజలేవరూ నివసించలేని పరిస్థితి ఏర్పడబోతుందని అన్నారు. యుఎన్‌ఆర్‌డబ్ల్యుఎ పాఠశాలలు, భవనాల దుస్థితిని వివరిస్తూ ఇక్కడి పారిశుద్ధ్య పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయని లజ్జరిని అన్నారు. లాజిస్టిక్స్ బేస్‌లో వందలాది మంది ఒకే టాయిలెట్‌ను ఉపయోగిస్తున్నారు. గాజాకు సామాగ్రి చేరడం

గాజాలో ధీనస్థితి..తిండినీళ్లు లేక..  ఎటు చూసినా శవాల గుట్టలే.. మృతదేహాలను గుర్తించలేక అవస్థలు..
Hamas Attack
Follow us on

ఇజ్రాయెల్ వైమానిక దాడులతో గాజా పరిస్థితులు దయనీయంగా మారాయి.. ప్రస్తుతం, ఇజ్రాయెల్ సైన్యం గాజాలో నిరంతరం వైమానిక దాడులు చేస్తోంది. దీంతో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. అటువంటి పరిస్థితిలో, గాజాలో మృతదేహాలను తొలగించటం, భద్రత పరచటం కూడా కష్టంగా మారింది. బ్యాగ్‌ల కొరత కూడా తీవ్రంగా ఉందని ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ తెలిపింది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో గాజా సామాన్య ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. గాజాలో ఇజ్రాయెల్ సైన్యం జరిపిన బాంబు దాడుల కారణంగా ఇప్పటివరకు గాజాకు చెందిన 2700 మందికి పైగా మరణించారు. ప్రస్తుతం మృతదేహాలను కప్పి ఉంచే బాడీ బ్యాగ్‌ల కొరత ఏర్పడే పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి సంస్థ స్వయంగా వెల్లడించింది. గాజా పతనం అంచున ఉందని ఏజెన్సీ తెలిపింది.

గాజా స్ట్రిప్‌లో విద్యుత్, నీటి కొరత కూడా వేగంగా పెరుగుతోందని యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ వర్క్స్ ఏజెన్సీ (UNRWA) కమిషనర్-జనరల్ ఫిలిప్ లాజారినీ చెప్పారు. ఈ సమయంలో ప్రపంచం మానవత్వాన్ని కోల్పోయినట్లు కనిపిస్తోంది. గాజాలో ప్రజలేవరూ నివసించలేని పరిస్థితి ఏర్పడబోతుందని అన్నారు. యుఎన్‌ఆర్‌డబ్ల్యుఎ పాఠశాలలు, భవనాల దుస్థితిని వివరిస్తూ ఇక్కడి పారిశుద్ధ్య పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయని లజ్జరిని అన్నారు. లాజిస్టిక్స్ బేస్‌లో వందలాది మంది ఒకే టాయిలెట్‌ను ఉపయోగిస్తున్నారు. గాజాకు సామాగ్రి చేరడం ప్రారంభించే వరకు, UNRWA మరియు సహాయక కార్మికులు సహాయక చర్యలను కొనసాగించలేరు.

మరోవైపు..కమీషనర్-జనరల్ మాట్లాడుతూ, ‘పాఠశాలలు, ఇతర UNRWA సైట్‌లలో ఆశ్రయం పొందుతున్న వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. కానీ వాటిని నెరవేర్చగల సామర్థ్యం చాలా తక్కువగా ఉందన్నారు. UNRWA ఆపరేషన్ గాజా స్ట్రిప్‌లో అతిపెద్ద ఐక్యరాజ్యసమితి మిషన్. అది ఇప్పుడు పతనం అంచున ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై దాడి తర్వాత, ఇజ్రాయెల్ ఇప్పుడు హమాస్ ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.. భూదాడికి ముందు ఇజ్రాయెల్ సైనికులు గాజా సమీపంలోకి భారీగా మోహరించారు. గాజాకు ఉత్తరాన నివసిస్తున్న 1.1 మిలియన్ల పాలస్తీనియన్లను యుద్ధానికి ముందు దక్షిణానికి తరలించాలని ఇజ్రాయెల్ కోరింది.

ఆసుపత్రుల్లో ఇంధన నిల్వలు 24 గంటల కంటే ఎక్కువ ఉండవని OCHA తెలిపింది. బ్యాకప్ జనరేటర్ వైఫల్యం వేలాది మంది రోగుల జీవితాలను తక్షణ ప్రమాదంలో పడేస్తుంది. గాజాలోని ఆసుపత్రులు కరెంటు లేక మార్చురీలుగా మారే ప్రమాదం ఉందని ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ రెడ్ క్రాస్ (ఐసీఆర్‌సీ) పేర్కొంది. అక్టోబర్ 13 వరకు, గాజాలో కనీసం 144 విద్యా సౌకర్యాలు, 20 UNRWA పాఠశాలలు వైమానిక దాడులతో తీవ్రంగా దెబ్బతిన్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..